అఫ్గాన్‌‌‌‌‌‌‌‌ అదరహో..8 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌పై గ్రాండ్ విక్టరీ

అఫ్గాన్‌‌‌‌‌‌‌‌ అదరహో..8 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌పై గ్రాండ్ విక్టరీ

చెన్నై: వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌ సంచలన పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ కొనసాగుతోంది. మొన్న డిఫెండింగ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌ ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌కు షాకిచ్చిన అఫ్గాన్‌‌‌‌‌‌‌‌ తాజాగా పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ను చిత్తు చేసింది. భారీ టార్గెట్‌‌‌‌‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో ఇబ్రహీం జద్రాన్‌‌‌‌‌‌‌‌ (87), రహమత్‌‌‌‌‌‌‌‌ షా (77 నాటౌట్‌‌‌‌‌‌‌‌), రహమానుల్లా గుర్బాజ్‌‌‌‌‌‌‌‌ (65) దుమ్మురేపడంతో.. సోమవారం జరిగిన లీగ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌ 8 వికెట్ల తేడాతో పాక్‌‌‌‌‌‌‌‌పై గెలిచింది. టాస్‌‌‌‌‌‌‌‌ గెలిచిన పాక్‌‌‌‌‌‌‌‌ 50 ఓవర్లలో 282/7 స్కోరు చేసింది.

అబ్దుల్లా షఫీక్‌‌‌‌‌‌‌‌ (58), బాబర్‌‌‌‌‌‌‌‌ ఆజమ్‌‌‌‌‌‌‌‌ (74), షాదాబ్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ (40), ఇఫ్తికార్‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌‌‌‌‌‌‌‌ (40) రాణించారు. అఫ్గాన్‌‌‌‌‌‌‌‌ బౌలర్లలో నూర్‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌‌‌‌‌‌‌‌ 3, నవీన్‌‌‌‌‌‌‌‌ ఉల్‌‌‌‌‌‌‌‌ హక్‌‌‌‌‌‌‌‌ 2 వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌ 49 ఓవర్లలో 286/2 స్కోరు చేసి గెలిచింది. పాక్‌‌‌‌‌‌‌‌ బౌలర్ల నుంచి పెద్దగా ప్రతిఘటన లేకపోవడంతో ఓపెనర్లు గుర్బాజ్‌‌‌‌‌‌‌‌, ఇబ్రహీం తొలి వికెట్‌‌‌‌‌‌‌‌కు 130 రన్స్‌‌‌‌‌‌‌‌ జోడించి శుభారంభాన్నిచ్చారు. తర్వాత నిలకడగా ఆడిన రహమత్‌‌‌‌‌‌‌‌ షా.. ఇబ్రహీంతో రెండో వికెట్‌‌‌‌‌‌‌‌కు 60, హష్మతుల్లా షాహిది (48 నాటౌట్‌‌‌‌‌‌‌‌)తో మూడో వికెట్‌‌‌‌‌‌‌‌కు 96 రన్స్‌‌‌‌‌‌‌‌ జత చేసి గెలిపించాడు. ఇబ్రహీంకు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది. తాజా ఓటమితో పాక్‌‌‌‌‌‌‌‌ సెమీస్‌‌‌‌‌‌‌‌ ఆశలు మరింత క్లిష్టమయ్యాయి.