భారత్ వేదికగా టీమిండియాతో ఆఫ్ఘనిస్థాన్ మూడు టీ20ల సిరీస్ లో భాగంగా రేపు(జనవరి 11) తొలి టీ20 జరగనుంది. మరికొన్ని గంటల్లో ఈ సిరీస్ ప్రారంభం కానుండగా ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. 19 మంది ప్రకటించిన ప్రాబబుల్స్ లో రషీద్ కు స్థానం కల్పించిన సంగతి తెలిసిందే. సబ్జెక్టు టు ఫిట్ నెస్ కింద రషీద్ ను సెలక్ట్ చేయగా.. గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని తెలిసింది.
ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. వరల్డ్ కప్ తర్వాత రషీద్ ఖాన్ ఎలాంటి అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. UKలో శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత వెన్ను గాయం నుండి కోలుకుంటున్నాడు. గాయం కారణంగా అడిలైడ్ స్ట్రైకర్స్ తరపున బిగ్ బాష్ లీగ్ కు దూరమయ్యాడు. రషీద్ ఖాన్ ఎప్పుడు అందుబాటులో ఉంటాడో తెలియాల్సి ఉంది. రషీద్ లేకపోవడంతో ఈ సిరీస్‌లో మహ్మద్ నబీ, కైస్ అహ్మద్, నూర్ అహ్మద్ స్పిన్ విభాగాన్ని నడిపించనున్నారు.
2024 జూన్ 1 నుండి జూన్ 29 వరకు వెస్టిండీస్, USA లలో జరగనున్న T20 ప్రపంచ కప్‌కు రషీద్ ఖాన్ ఫిట్‌నెట్ సాధించడం చాల కీలకం. జనవరి 11 న మొహాలీలో తొలి టీ20, 14 న ఇండోర్ లో రెండో టీ20, 17న బెంగళూరులో మూడో టీ20 జరుగుతాయి. ఇదిలా ఉండగా ద్వైపాక్షిక సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారత్ లో పర్యటించడం ఇదే తొలిసారి.
ఆఫ్ఘనిస్తాన్ స్క్వాడ్
ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), హజ్రతుల్లా జజాయ్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జనాత్, అజ్మౌల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, ముజీబ్ ఉర్ రహ్మద్, ఫజల్ హఖ్మాన్, ఎఫ్. నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, మహ్మద్ సలీమ్, కైస్ అహ్మద్, గుల్బాదిన్ నాయబ్
Rashid Khan ruled out of the T20i series against India. pic.twitter.com/voGlXrolD6
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 10, 2024