AFG vs SA: సౌతాఫ్రికాతో ఆఫ్ఘనిస్తాన్ తొలి ద్వైపాక్షిక సిరీస్.. వేదిక ఎక్కడంటే..?

AFG vs SA: సౌతాఫ్రికాతో ఆఫ్ఘనిస్తాన్ తొలి ద్వైపాక్షిక సిరీస్.. వేదిక ఎక్కడంటే..?

ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికాతో తొలిసారి ద్వైపాక్షిక సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ లో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కు ఆఫ్ఘనిస్థాన్ దక్షిణాఫ్రికాకు ఆతిథ్యం ఇవ్వనుంది. సెప్టెంబర్ 18 నుండి 22 వరకు ఈ సిరీస్ జరుగుతుంది. మూడు వన్డేలు షార్జా క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి. ఇరు జట్లు ఇప్పటివరకు ఐసీసీ ఈవెంట్స్ లో మాత్రమే తలపడడం విశేషం. 

2019, 2023 వన్దే ప్రపంచ కప్ లో దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఈ రెండు మ్యాచ్ ల్లోనూ సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. చివరిసారిగా రెండు జట్లు 2024 టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో తలపడ్డాయి. ఈ మ్యాచ్ లోనూ సఫారీలదే విజయం. ఈ సిరీస్ పై ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది. 2023 వన్డే ప్రపంచ కప్.. 2024 టీ20 వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ అగ్రశ్రేణి జట్లకు పోటీ ఇచ్చి ఆల్ రౌండ్ జట్టుగా మారింది. దక్షిణాఫ్రికాతో సిరీస్ జరగడం చాలా సంతోషంగా ఉంది". అని ఒక ప్రకటనలో తెలిపారు.          

సౌతాఫ్రికా-ఆఫ్ఘనిస్తాన్ మూడు వన్డేల సిరీస్ షెడ్యూల్: 
 
మొదటి వన్డే -బుధవారం- సెప్టెంబర్ 18- షార్జా క్రికెట్ స్టేడియం, UAE

రెండో వన్డే - శుక్రవారం-  సెప్టెంబర్ 20- షార్జా క్రికెట్ స్టేడియం, UAE

మూడో వన్డే - ఆదివారం-సెప్టెంబర్ 22- షార్జా క్రికెట్ స్టేడియం, UAE