లీడ్స్ : వరల్డ్ కప్-2019లో భాగంగా శనివారం పాక్ తో జరుగుతున్న మ్యాచ్ లో అఫ్గాన్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 227 రన్స్ చేసింది. ప్రారంభంలోనే 2 వికెట్లు కోల్పోయినప్పటికీ..ఆ తర్వాత వచ్చిన ప్లేయర్లు నిలకడగా ఆడుతూ ..బిగ్ స్కోర్ చేసే ప్రయత్నం చేశారు. అయితే షాహీన్ అఫ్రిదీ 4 వికెట్లతో రెచ్చిపోవడంతో అఫ్గాన్ దూకుడుకు బ్రేక్ పడింది.
అఫ్గాన్ ప్లేయర్లలో..అస్ఘర్ అఫ్గాన్ (42; 35 బాల్స్ 3×4, 2×6), నజీబ్(42; 54బాల్స్ 4×6) ఎక్కువ రన్స్ చేయగా..చెలరేగుతారనుకున్న నబీ(16), రషీద్ ఖాన్(8) మరోసారి నిరాశపరిచారు.
పాక్ బౌలర్లలో..షాహీన్ అఫ్రిదీ (4), ఇమద్ వసీమ్(2), వవాబ్ రియాజ్(2), శదాబ్ ఖాన్(1) వికెట్లు తీశారు.
Afghanistan finish on 227/9!
An excellent effort from the Pakistan bowling attack ? #CWC19 | #PAKvAFG | #WeHaveWeWill | #AfghanAtalan pic.twitter.com/z4Gkn7JSYp
— Cricket World Cup (@cricketworldcup) June 29, 2019