టీ20 వరల్డ్ కప్ లో అఫ్గానిస్తాన్ సత్తా చాటుతోంది. ఇవాళ పాపువా న్యూగినియాతో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో గెలిచి సూపర్ 8కు దూసుకెళ్లింది. 96 పరుగుల టార్గెట్ ను 15.1 ఓవర్లోనే చేధించింది అఫ్గాన్. గుల్భదిన్ నాయబ్ 49 పరుగులతో అదరగొట్టాడు. 96 పరుగుల లక్ష్యానికి 3 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసింది అఫ్గాన్.
అంతకుముందుటాస్ ఓడి బ్యాటిగ్ కు దిగిన పాపువా న్యూగినియాను 95 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అఫ్గాన్ బౌలర్లు చెలరేగారు. టోని ఉర్ 11, కిప్లిన్ డోరిగా 27,అలినావో 13 మినహా మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు.దీంతో పాపువా 95 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
3 మ్యాచుల్లో 100 లోపే ఆలౌట్
టీ20 వరల్డ్ కప్ లో అఫ్గానిస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచుల్లోనూ ప్రత్యర్థి జట్లను 100 పరుగుల్లోపే ఆలౌట్ చేశారు. వీరి ధాటికి ఉగాండా 58, న్యూజిలాండ్ 75, పపువా న్యూ గినియా 95 పరుగులకే ఆలౌట్ అయ్యాయి. ఫారూఖీ 3 మ్యాచుల్లో 12 వికెట్లతో టోర్నీలో లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నారు.