చెలరేగిన విండీస్..అఫ్గాన్ కు భారీ లక్ష్యం

చెలరేగిన విండీస్..అఫ్గాన్ కు భారీ లక్ష్యం

వరల్డ్ కప్-2019లో భాగంగా గురువారం అఫ్గాన్ తో జరిగిన మ్యాచ్ లో భారీ స్కోర్ చేసింది వెస్టిండీస్. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన విండీస్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 311 రన్స్ చేసింది. విండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ ప్రారంభంలోనే ఔట్ అయినప్పటికీ .. హోప్ , లివీస్, పూరన్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. హోప్(77), లివీస్(58)  రాణించడంతో విండీస్ రన్ రేట్ పెరుగుతూ వచ్చింది. చివర్లో హోల్డర్(45), నికోలస్ పూరన్(58), బ్రాత్ వైట్(4 బాల్స్ లో 14 నాటౌట్) చెలరేగడంతో భారీ స్కోర్ చేసింది విండీస్.

ఆఫ్గన్ బౌలర్లలో దావ్లాత్ జద్రాన్ 2 వికెట్లు పడగొట్టగా, సయిద్ షిర్జాద్, మహమ్మద్ నబీ, రషీద్ ఖాన్‌ లు తలా 1 వికెట్ తీశారు.