వరల్డ్ కప్ : అఫ్గాన్ తో మ్యాచ్..విండీస్ బ్యాటింగ్

వరల్డ్ కప్ : అఫ్గాన్ తో మ్యాచ్..విండీస్ బ్యాటింగ్

వరల్డ్ కప్-2019లో భాగంగా గురువారం అఫ్గాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచింది వెస్ట్ ఇండీస్. కెప్టెన్ వోల్డర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే ఈ రెండు టీమ్స్ వరల్డ్ కప్ నుంచి ఔట్ అయ్యాయి. రౌండ్‌ రాబిన్‌ పద్ధతిలో ఆఖరి మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. 2 టీమ్స్ కూ ఇది నామమాత్రమే అయినా ఆఖరి మ్యాచ్‌ లో గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తున్నాయి. దీంతో ఎవరు గెలుస్తారో వేచిచూడాలి. విండీస్‌ విధ్వంసక ఆటగాడు క్రిస్‌గేల్‌కు ప్రపంచకప్‌లో ఇదే ఆఖరి మ్యాచ్‌ కానుండటం విశేషం.

టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి..

వెస్టిండీస్‌ జట్టు: క్రిస్‌గేల్‌, ఎవిన్‌ లెవిస్‌, షైహోప్‌, షిమ్రన్‌ హెట్మేయర్‌, నికోలస్‌ పూరన్‌, జేసన్‌ హోల్డర్‌(కెప్టెన్‌), కార్లోస్‌ బ్రాత్‌వైట్‌, ఫాబియన్‌ అలెన్‌, షెల్డన్‌ కాట్రెల్‌, ఒషానె థామస్‌, కీమర్‌ రోచ్‌

అఫ్గానిస్థాన్‌ జట్టు: రహ్మత్‌షా, గుల్బాడిన్‌ నైబ్‌(కెప్టెన్‌), అస్ఘర్‌ అఫ్గాన్‌, మొహ్మద్‌ నబీ, సైముల్లా షిన్‌వారీ, నజీబుల్లా జద్రాన్‌, ఇక్రమ్‌ అలీ ఖిల్‌, రషీద్‌ ఖాన్‌, దావ్లత్‌ జద్రాన్‌, సయద్‌ షిర్‌జాద్‌, ముజీబ్‌ ఉర్‌ రహ్మాన్‌