- ఫారూఖీ 5/9
ప్రొవిడెన్స్ (గయానా): ఆల్‌రౌండ్ షోతో చెలరేగిన అఫ్గానిస్తాన్.. టీ20 వరల్డ్ కప్‌లో బోణీ చేసింది. పేసర్ ఫజల్‌హక్ ఫారూఖీ (5/9) సూపర్ స్పెల్‌కు తోడు రెహ్మనుల్లా గుర్బాజ్ (45 బాల్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 76), ఇబ్రహీం జద్రాన్ (46 బాల్స్‌లో 9 ఫోర్లు, 1 సిక్స్‌తో 70) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో.. మంగళవారం జరిగిన గ్రూప్–సి లీగ్ మ్యాచ్‌లో 125 రన్స్ తేడాతో ఉగాండాపై గెలిచింది. టాస్ ఓడిన అఫ్గాన్ 20 ఓవర్లలో 183/5 స్కోరు చేసింది. ఉగాండా బౌలింగ్‌లో పస లేకపోవడంతో ఓపెనర్లు గుర్బాజ్, జద్రాన్ తొలి వికెట్‌కు 154 రన్స్ జోడించారు.
అయితే ఐదు బాల్స్ తేడాలో ఈ ఇద్దరు ఔటవగా.. వరుస విరామాల్లో గుల్బాదిన్ నైబ్ (4), అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (5) వెనుదిరిగారు. మహ్మద్ నబీ (14 నాటౌట్) ఫర్వాలేదనిపించాడు. ప్రత్యర్థి బౌలర్లలో కెవుటా, కమసాబా చెరో రెండు వికెట్లు తీశారు. ఛేజింగ్‌లో ఫారూఖీ దెబ్బకు ఉగాండా 16 ఓవర్లలో 58 రన్స్‌కే కుప్పకూలింది. రాబిన్సన్ ఒబుయా (14) టాప్ స్కోరర్. రజత్ అలీ (11) ఓ మాదిరిగా ఆడాడు. ఫారూకీ, నవీన్ (2/4), రషీద్ (2/12) సమయోచిత బౌలింగ్ ముందు ఉగాండా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇన్నింగ్స్‌లో నలుగురు డకౌట్ కాగా, ఐదుగురు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. ఫారూఖీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.