వరల్డ్ కప్ లో మరో కీలకమైన మ్యాచ్ ఇవాళ జరుగుతుంది. ఆస్ట్రేలియా, ఆఫ్గనిస్తాన్ మధ్య ముంబై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో.. ఆఫ్ఘనిస్తాన్ జట్టు టాస్ గెలిచింది. మొదట బ్యాటింగ్ తీసుకుంది. ఆసీస్ కు బౌలింగ్ అప్పగించింది. రెండు జట్లకు ఇది కీలకమైన మ్యాచ్ కావటంతో.. రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియాలో నేరుగా సెమీఫైనల్స్ లోకి చేరాలంటే.. ఆఫ్ఘనిస్తాపై గెలవాలి. అలా కాకుండా ఆఫ్ఘనిస్తాన్ ఆసీస్ పై గెలిస్తే మాత్రం సెమీస్ రేసు మరింత రసవత్తరంగా మారనుంది. టెన్షన్ లేకుండా ఆఫ్ఘన్ ను మట్టికరిపించి.. సెమీస్ బెర్త్ కన్ఫామ్ చేసుకోవాలని చూస్తోంది ఆస్ట్రేలియా.
ఇదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ మంచి ఊపులో ఉంది. వరసగా మూడు మ్యాచులు గెలిచింది. పాకిస్తాన్, శ్రీలంక, నెదర్లాండ్స్ ను ఓడించి మంచి కసితో.. ఊపుతో ఉంది ఆప్ఘన్ జట్టు. న్యూజిలాండ్, పాకిస్తాన్ సరసన ఉన్న ఆఫ్ఘనిస్తాన్ జట్టు.. ఆసీస్ ను ఓడించి సెమీస్ రేసులోకి వెళ్లటానికి ఉత్సాహంగా బరిలోకి దిగుతుంది. టాస్ గెలవటం, బ్యాటింగ్ తీసుకోవటం ద్వారా ఈ మ్యాచ్ ఏ స్థాయిలో జరుగుతుంది అనేది ఆసక్తిగా మారింది.
Also Read:- ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. మిచెల్ మార్ష్ వచ్చేశాడు