AFG vs SA 2024: సఫారీలను చిత్తుగా కొట్టారు: దక్షిణాఫ్రికాపై సిరీస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్

AFG vs SA 2024: సఫారీలను చిత్తుగా కొట్టారు: దక్షిణాఫ్రికాపై సిరీస్ గెలిచిన ఆఫ్ఘనిస్థాన్

క్రికెట్ లో ఆఫ్ఘనిస్తాన్ పసికూన జట్టు ట్యాగ్ నుంచి బయటకు వచ్చేసినట్టుగానే కనిపిస్తుంది. రషీద్ ఖాన్, ముజీబ్, నబీ, నవీన్ ఉల్ హక్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నా.. ఒత్తిడిలో చిత్తవ్వడం ఆ జట్టుకు అలవాటు. ఆఫ్ఘనిస్తాన్ జట్టును నిన్నటివరకు ఒక చిన్న జట్టులాగే చూశారు. తమదైన రోజున ఒక పెద్ద జట్టుకు షాక్ ఇచ్చినా నిలకడగా ఆడలేదనే పేరుంది. అయితే ఇప్పుడు సీన్ మారింది. గత సంవత్సరం నుంచి ఆ జట్టు ఎంతో నిలకడ చూపిస్తుంది. తాజాగా పటిష్టమైన దక్షిణాఫ్రికాను మట్టికరిపించి సిరీస్ గెలిచింది. 

దక్షిణాఫ్రికాపై సిరీస్ అంటే ఆఫ్ఘనిస్తాన్ గట్టి పోటీని ఇస్తుందనుకున్నారు. అయితే సఫారీలకు ఆఫ్గన్లు ఊహించని షాక్ ఇచ్చారు. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి రెండు వన్డేలు గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను గెలుచుకుంది. తొలి వన్డేలో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి 6 వికెట్ల తేడాతో విజయం సాధించగా.. శుక్రవారం (సెప్టెంబర్ 20) షార్జా వేదికగా జరిగిన రెండో వన్డేలో ఏకంగా 177 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఆఫ్ఘనిస్తాన్ వన్డే చరిత్రలో ఇదే అతి పెద్ద విజయం. గెలిచిన రెండు మ్యాచ్ లు కూడా భారీ తేడాతో గెలవడం విశేషం. 

Also Read:-బంగ్లాను చుట్టేసిన రోహిత్.. ఒకే ఫ్రేమ్‌లో 11 మంది ఫీల్డర్లు

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేరిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 311 పరుగుల భారీ స్కోర్ చేసింది. రహ్మానుల్లా గుర్బాజ్ 105 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఓమర్జాయ్ 50 బంతుల్లోనే 86 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. 312 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 35వ ఓవర్లో 134 పరుగులకు ఆలౌట్ అయింది. రషీద్ ఖాన్ 5 వికెట్లతో సఫారీల వెన్ను విరిచాడు. కరోటీకి నాలుగు వికెట్లు దక్కాయి.