ఇప్పుడిప్పుడే క్రికెట్ లో ఎదుగుతున్న అఫ్గానిస్థాన్ జట్టు పాకిస్థాన్ కు బిగ్ షాకిచ్చింది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య షార్జా వేదికగా మార్చి 25న జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో అఫ్గానిస్థాన్ జట్టు 6 వికెట్ల తేడాతో ఓడించింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 92 పరుగులు మాత్రమే చేసింది.
బాబర్ అజామ్, మహమ్మద్ రిజ్వాన్ లేకుండా బరిలోకి దిగిన పాక్.. అఫ్గాన్ బౌలర్ల ధాటికి విలవిల్లాడింది. దీంతో 92 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన అఫ్గానిస్థాన్ జట్టు మరో 6 వికెట్లు, 13 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. అఫ్గానిస్థాన్‌ను మహమ్మద్ నబీ (38), నజీబుల్లా జద్రాన్ (17) నిలకడగా ఆడి గెలిపించారు.
పాకిస్థాన్ పై అఫ్గానిస్థాన్ కు ఇదే తొలి విజయం కావడం విశేషం. మున్మందు ఇదే జోరును కొనసాగిస్తామని అఫ్గానిస్థాన్ జట్టు కెప్టెన్ రషీద్ ఖాన్ వెల్లడించాడు.