ఆఫ్ఘనిస్తాన్ పర్యనలో భాగంగా ఐర్లాండ్ ఒక టెస్ట్ మ్యాచ్, మూడు వన్డేలతో పాటు మూడు టీ20T20I మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఫిబ్రవరి 28 నుంచి అబుదాబిలో టెస్టు మ్యాచ్ జరగాల్సి ఉండగా.. షార్జా క్రికెట్ స్టేడియం మార్చి 7 నుంచి వన్డేలు, మార్చి 15 నుంచి టీ20లకు ఆతిథ్యమివ్వాల్సి ఉంది. అయితే టెస్ట్ మ్యాచ్ జరగడానికి ఒక్క రోజు ముందు వేదిక మార్చడం ఆశ్చర్యకరంగా మారింది.
అబుదాబిలో స్కూల్స్ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్ జరగనుండడంతో మ్యాచ్ వేదిక మార్చాల్సి వచ్చింది. 1,000 జట్లు, 25,000 మంది అథ్లెట్లు ఆడతారు. షేక్ జాయెద్ స్టేడియంలో ఈ మ్యాచ్ లు జరుగుతాయి. ఈ స్టేడియం సీటింగ్ కెపాసిటీ 20,000 మంది ఉంది. 2010-11 2018-19 మధ్య పాకిస్థాన్ 13 టెస్ట్ మ్యాచ్‌లు, 2020-21లో ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే మధ్య మరో రెండు టెస్ట్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. 100 కు పైగా పరిమిత ఓవర్ల మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది.
షేక్ జాయెద్ స్టేడియంలో జరగాల్సిన ఈ మ్యాచ్ ను పక్కనే ఉన్న టోలరెన్స్ ఓవల్‌కు తరలించాల్సి వచ్చింది. జాయెద్ స్టేడియంతో పోల్చుకుంటే ఇక్కడ సీటింగ్ కెపాసిటీ తక్కువగా ఉంటుంది. ఈ స్టేడియం 12,000 మందికి ఆతిధ్యం కలిగిస్తుంది. 2021 మెన్స్ T20 వరల్డ్ కప్, 2023 మహిళల T20 ప్రపంచకప్ క్వాలిఫైయర్‌లతో సహా మొత్తం 19 టీ20 మ్యాచ్ లకు ఆతిథ్యం ఇచ్చింది.
Afghanistan vs Ireland test shifted from Sheikh Zayed Stadium for the Abu Dhabi Schools Sports Championship, between March 1 and 3. pic.twitter.com/EUClyKg8fs
— Himanshu Pareek (@Sports_Himanshu) February 27, 2024