24 ఏళ్ల ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ నవీన్ ఉల్ హక్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వరల్డ్ కప్ 2023 తరువాత వన్డేల నుంచి తప్పుకోనున్నట్లుగా వెల్లడించాడు. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టాడు . తాను టీ20ల్లో మాత్రమే కొనసాగుతానని చెప్పాడు. తన దేశానికి ప్రాతినిధ్యం వహించడం తనకు లభించిన గౌరవం అని తెలిపాడు. మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదలు తెలిపాడు.
2016లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన నవీన్.. ఇప్పటివరకు 7 వన్డేలు మాత్రమే ఆడిన 14 వికెట్లు తీశాడు. గత ఐపీఎల్ సీజన్ లో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీతో వివాదంతో ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. కాగా రెండేళ్ల విరామం తరువాత నవీన్ ఉల్ హక్ వన్డే ప్రపంచ్ కప్ లో చోటు దక్కి్ంచుకున్నాడు.
ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచకప్ జట్టు: హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్ ), రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, ఇక్రమ్ అలీఖిల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్, రహ్మద్ రహ్మద్, ఎఫ్. , నవీన్ ఉల్ హక్.