ముదురుతోన్న లొల్లి.. పాక్‎పై అఫ్గానిస్తాన్ ప్రతీకార దాడులు

ముదురుతోన్న లొల్లి.. పాక్‎పై అఫ్గానిస్తాన్ ప్రతీకార దాడులు

కాబూల్: పాకిస్తాన్‎పై అఫ్గానిస్తాన్ ప్రతీకార దాడులు చేసింది. శనివారం పాక్‎లోని కొన్ని స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది. ఈ విషయాన్ని అఫ్గాన్‌‌‌‌‌‌‌‌ రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ మేరకు ఎక్స్‎లో ఓ  పోస్ట్ పెట్టింది. ‘‘పాక్ పై ప్రతీకార దాడులు చేశాం. ఆ దేశంలోని రహస్య స్థావరాలను చేసుకుని లక్ష్యంగా చేసుకుని అటాక్స్ జరిపాం”అని రక్షణ శాఖ ప్రతినిధి ఇనాయాతుల్లా క్వార్జామి ‘ఎక్స్’ లో వెల్లడించారు. పాక్‌‌‌‌‌‌‌‌పై ఏ విధంగా దాడి చేశారు..? ఇందులో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారనే విషయాలను మాత్రం ఆ ప్రతినిధి ప్రస్తావించలేదు. తాలిబన్ల మద్దతు గల ఓ మీడియా సంస్థ మాత్రం.. ఈ దాడుల్లో 19 మంది పాకిస్తానీ సైనికులు మరణించారని ఆ కథనంలో పేర్కొంది. ఈ దాడిపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ మాత్రం ఎటువంటి ప్రకటన జారీ చేయలేదు.