జద్రాన్ జోర్‎దార్.. ఇంగ్లాండ్‎పై అఫ్గాన్ సంచలన విజయం

జద్రాన్ జోర్‎దార్.. ఇంగ్లాండ్‎పై అఫ్గాన్ సంచలన విజయం

లాహోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఐసీసీ టోర్నీల్లో సంచలనాల జట్టుగా పేరొందిన అఫ్గానిస్తాన్ మరోసారి అదరగొట్టింది. చాంపియన్స్ ట్రోఫీలో అద్భుత ఆటతో బలమైన ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు షాకిచ్చి ఔరా అనిపించింది. మెగా టోర్నీలో ఇంగ్లిష్ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముందే ఇంటిదారి పట్టించింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (146 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 177) రికార్డు సెంచరీకి తోడు అజ్మతుల్లా ఒమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జాయ్ (41; 5/ 58) ఆల్‌రౌండ్‌ షోతో విజృంభించడంతో బుధవారం జరిగిన గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–బి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  అఫ్గాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 8  రన్స్ తేడాతో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించింది. తొలుత అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 325/7 స్కోరు చేసింది. 

మహ్మద్ నబీ (24 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 40) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (40) కూడా రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూడు, లివింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టోన్ రెండు వికెట్లు పడగొట్టారు. ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జో రూట్ (111 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 11 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 120) సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 317 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. వరుసగా రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లో పరాజయాలతో ఇంగ్లిష్​ టీమ్ టోర్నీ నుంచి నిష్ర్కమించగా.. అఫ్గాన్ సెమీస్ రేసులో నిలిచింది. జద్రాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 

జోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దార్ జద్రాన్

ఇబ్రహీం జద్రాన్ అద్భుత సెంచరీతో అఫ్గాన్ భారీ స్కోరు చేసింది. ఆరంభంలో మాత్రం పేసర్ జోఫ్రా ఆర్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొట్టిన‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దెబ్బకు జద్రాన్ మినహా టాపార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుదేలైంది. టాస్ నెగ్గిన అఫ్గాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రాగా.. ఐదో ఓవర్లో ఆర్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. తొలుత పదునైన ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్వింగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (6)ను బౌల్డ్‌​చేసిన అతను మరో ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్ట్రెయిట్ బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సెదిఖుల్లా అటల్ (4)ను ఎల్బీ చేశాడు. తొమ్మిదో ఓవర్లో రహ్మత్ షా (4)ను కూడా వెనక్కు పంపడంతో 37/3తో నిలిచిన అఫ్గాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఇంగ్లిష్ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కనీస పోటీ ఇస్తే గొప్పే అనిపించింది.

ఈ దశలో జద్రాన్ ఇన్నింగ్స్ బాధ్యతను తీసుకున్నాడు. అతనికి కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాహిది సపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 103 రన్స్ జోడించడంతో అఫ్గాన్ కోలుకుంది. తొలుత జాగ్రత్తగా ఆడిన జద్రాన్ 65 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న తర్వాత జోరు పెంచాడు. ఓవర్టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండు ఫోర్లతో స్పీడందుకున్నాడు. ఈ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో స్పిన్నర్ ఆదిల్ రషీద్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రివర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్వీప్ షాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడి షాహిది ఔటైనా.. జద్రాన్ వెనక్కు తగ్గలేదు. ఒమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జాయ్ తోడుగా తన ధాటిని కొనసాగించాడు. 

ఈ క్రమంలో 106 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సెంచరీ అందుకున్నాడు. ఆ తర్వాత మరింతగా విజృంభించిన జద్రాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఓవర్టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓవర్లో 6,4,4తో రెచ్చిపోయాడు. 40వ ఓవర్లో ఒమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఔటవడంతో ఐదో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 72 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. అప్పటికి అఫ్గాన్ స్కోరు 215/5. స్లాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓవర్లలో జద్రాన్ మరింతగా రెచ్చిపోయాడు. ఆర్చర్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 6, 4, 4, 4 కొట్టిన అతను 150 రన్స్ మార్కు దాటాడు. చివర్లో జద్రాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తోడు నబీ కూడా భారీ షాట్లతో విరుచుకుపడటంతో చివరి పది ఓవర్లలో ఏకంగా 113 రన్స్ వచ్చాయి.  

రూట్ ఒంటరి పోరాటం

భారీ టార్గెట్ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆరంభం నుంచే తడబడింది. వెటరన్ బ్యాటర్ జో రూట్ ఒంటరి పోరాటం చేసినా అతనికి సరైన సహకారం కరువైంది. ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లేని ఓపెనర్ ఫిల్ సాల్ట్ (12) మరోసారి నిరాశపరిచాడు. ఒమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జాయ్ వేసిన నాలుగో ఓవర్లో తను క్లీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బౌల్డ్ అవ్వగా.. స్పిన్నర్ నబీ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జెమీ స్మిత్ (9) అజ్మతుల్లాకు క్యాచ్ ఇవ్వడంతో ఇంగ్లండ్ 30/2తో డీలా పడింది. ఈ దశలో మరో ఓపెనర్ బెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డకెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (38), జో రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూడో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 68 రన్స్ జోడించి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చక్కదిద్దారు. కానీ, 17వ ఓవర్లో రషీద్ ఖాన్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డకెట్ ఎల్బీ అవ్వడంతో ఈ జోడీ విడిపోయింది. 

 నిలకడగా ఆడుతున్న రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కాసేపు సపోర్ట్ ఇచ్చిన హారీ బ్రూక్ (25) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. 22వ  ఓవర్లో నబీకి రిటర్న్ క్యాచ్ ఇవ్వడంతో ఇంగ్లండ్ 133/4తో ఎదురీత మొదలు పెట్టింది. ఈ దశలో రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తోడైన బట్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (38)‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ముందుకు తీసుకెళ్లాడు. మిడిల్ ఓవర్లలో అఫ్గాన్ స్పిన్నర్లను ఈ ఇద్దరూ మెరుగ్గా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో రూట్ 50 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. 34వ ఓవర్లో స్కోరు 200 దాటింది. ఇద్దరూ ప్రధాన బ్యాటర్లు క్రీజులో కుదురుకోవడంతో ఇంగ్లండ్ తిరిగి రేసులోకి వచ్చింది. కానీ, వేగం పెంచే ప్రయత్నంలో ఒమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జాయ్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారీ షాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ట్రై చేసిన బట్లర్ రహ్మత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాకు చిక్కడంతో ఐదో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 83 రన్స్ పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ బ్రేక్ అయింది.

హిట్టర్ లివింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (10) కూడా ఫెయిలైనా రూట్ తన జోరు కొనసాగిస్తూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇంకో ఎండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓవర్టన్ (32) కూడా క్రీజులో నిలదొక్కుకోగా.. చివరి 30 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 48 రన్స్ అవసరం అయ్యాయి. ఇరు జట్లకూ సమాన అవకాశాలు కనిపించాయి. కానీ, ఒమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వెంటాడి రూట్ కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు క్యాచ్ ఇవ్వడంతో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అఫ్గాన్ చేతుల్లోకి వెళ్లింది. చివరి మూడు ఓవర్లలో జోఫ్రా ఆర్చర్ (14)ను ఫరూఖీ.. ఓవర్టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆదిల్ రషీద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (5)ను ఒమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జాయ్ ఔట్ చేయడంతో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కథ ముగిసింది.

సంక్షిప్త స్కోర్లు

అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: 50 ఓవర్లలో 325/7 (జద్రాన్ 177, ఒమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జాయ్ 41, ఆర్చర్ 3/64).
ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: 49.5 ఓవర్లలో 317 ఆలౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (రూట్ 120, బట్లర్ 38, ఒమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జాయ్ 5/58)