కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్
న్యూఢిల్లీ: యాంటీ ఇండియా కార్యకలాపాలకు అఫ్గానిస్థాన్‌ను వినియోగించరాదని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. అఫ్గానిస్థాన్‌లో శాంతి నెలకొనాలనే విషయంపై దోహాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జైశంకర్ పాల్గొన్నారు. పొరుగు దేశమైన అఫ్గాన్‌లో శాంతి నెలకొనడానికి తీసుకోవాల్సిన చర్యలపై జైశంకర్ తన అభిప్రాయాలను చెప్పారు. ‘ఇండియా వ్యతిరేక కార్యకలాపాలకు అఫ్గానిస్థాన్ గడ్డను వినియోగించొద్దని మా అంచనా. అఫ్గాన్‌లో సుస్థిర శాంతి నెలకొనేలా చర్యలు మొదలవ్వాలి. ఆ దేశ సార్వభౌమత్వన్ని గౌరవించాలి. అలాగే అఫ్గాన్ ప్రాదేశిక సమగ్రతను కాపాడాలి. ఆ దేశంలో మానవ హక్కులు, ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడంతోపాటు వాటి గురించి ప్రచారం చేయాలి’ అని జైశంకర్ పేర్కొన్నారు.
Addressed conference on Afghan peace negotiations at Doha. Conveyed that peace process must be Afghan-led, Afghan-owned & Afghan-controlled, it must respect national sovereignty & territorial integrity of Afghanistan & must promote human rights & democracy: EAM Dr. S. Jaishankar pic.twitter.com/ZOCACAt8Rv
— ANI (@ANI) September 12, 2020