ఆర్మీలో మెడికల్ ఆఫీసర్స్​

ఆర్మీలో మెడికల్ ఆఫీసర్స్​

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న ఎఫ్‌‌‌‌సీఐ డిపోలు, కార్యాలయాల్లో 113 మేనేజ్‌‌‌‌మెంట్ ట్రెయినీ, మేనేజర్ పోస్టుల కోసం ఆన్‌‌‌‌లైన్​లో అప్లికేషన్స్​ కోరుతోంది. జనరల్, డిపో, మూవ్‌‌‌‌మెంట్, అకౌంట్స్, టెక్నికల్, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్, హిందీ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

ఖాళీలు: నార్త్ జోన్​లో 38, సౌత్ జోన్​లో 16, వెస్ట్ జోన్​లో 20, ఈస్ట్ జోన్​లో 21, నార్త్-ఈస్ట్ జోన్​లో 18 పోస్టులు ఉన్నాయి.  ఏదైనా గ్రాడ్యుయేట్, బీకాం, బీఎస్సీ, బీటెక్‌‌‌‌, సీఏ, ఎంఏ, ఎంబీఏ, పీజీడీఎం, ఐసీఏఐ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అర్హులు. 

సెలెక్షన్​: ఆన్‌‌‌‌లైన్ టెస్ట్ (ఫేజ్-1, ఫేజ్-2 పరీక్షలు), ఇంటర్వ్యూ, ట్రెయినింగ్‌‌‌‌ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. సెలెక్ట్​ అయిన అభ్యర్థులకు నెలకు రూ.40,000 – రూ.1,40,000 జీతం అందజేస్తారు.

దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​ ద్వారా సెప్టెంబర్ 26 వరకు దరఖాస్తు చేసుకోవాలి. రూ. 800 అప్లికేషన్​ ఫీజు చెల్లించాలి. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్​లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. డిసెంబర్​ నెలలో పరీక్ష నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం వెబ్​సైట్ ​www.recruitmentfci.in​ సంప్రదించాలి. 

ఆర్మీలో మెడికల్ ఆఫీసర్స్​

ఆర్మ్‌‌‌‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్(ఏఎఫ్‌‌‌‌ఎంఎస్‌‌‌‌) షార్ట్ సర్వీస్ కమిషన్ 420 మెడికల్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి అర్హులైన వైద్య అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది. 
అర్హత: ఎంబీబీఎస్‌‌‌‌, పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. ఇంటర్వ్యూ, ఫిజికల్, మెడికల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు: ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ద్వారా సెప్టెంబర్​ 18 లోపు దరఖాస్తు చేయాలి. ఇంటర్వ్యూలు సెప్టెంబర్​ 27 నుంచి ఆర్మీ హాస్పిటల్ (ఆర్‌‌‌‌ & ఆర్‌‌‌‌), ఢిల్లీ కంటోన్మెంట్‌‌‌‌ ఏరియాలో ప్రారంభమవుతాయి. వివరాలకు వెబ్​సైట్​www.amcsscentry.org లో సంప్రదించాలి. 

మేనేజ్​లో పీజీ డిప్లొమా

రాజేంద్రనగర్‌‌‌‌లోని నేషనల్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌‌‌‌టెన్షన్ మేనేజ్‌‌‌‌మెంట్(మేనేజ్) 2023–-2025 విద్యా సంవత్సరానికి పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌‌‌‌మెంట్(అగ్రి బిజినెస్ మేనేజ్‌‌‌‌మెంట్) కోర్సులో అడ్మిషన్స్​కు అప్లికేషన్స్​ కోరుతోంది. కనీసం 50% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ(అగ్రికల్చర్ సైన్సెస్/ హ్యూమానిటీస్, సోషల్ సైన్సెస్, ఇంజినీరింగ్, సైన్సెస్, కామర్స్). ఇండియన్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌‌‌‌మెంట్ నిర్వహించే క్యాట్‌‌‌‌- 2022 స్కోరు కలిగి ఉండాలి. క్యాట్ స్కోరు, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 31 వరకు అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.manage.gov.in వెబ్​సైట్ సంప్రదించాలి.