Paris Olympics 2024: ఆల్ టైం గ్రేట్ ఫొటో : ఇదెలా సాధ్యం.. స్పోర్ట్స్ చరిత్రలోనే అద్భుతం

Paris Olympics 2024: ఆల్ టైం గ్రేట్ ఫొటో : ఇదెలా సాధ్యం.. స్పోర్ట్స్ చరిత్రలోనే అద్భుతం

ఒకే ఒక్క ఫొటో ప్రపంచాన్ని మార్చొచ్చు.. ఒకే ఒక్క ఫొటో ప్రపంచాన్ని మాట్లాడిస్తుంది.. ఒకే ఒక్క ఫొటో ప్రపంచం మొత్తాన్ని తన వైపు తిప్పుకుంటుంది.. ఇప్పుడు అలాంటి ఫొటో ఒకటి.. అది కూడా ఒలింపిక్స్ స్పోర్ట్స్ జరుగుతున్న గేమ్ నుంచి వచ్చింది.. సర్ఫింగ్ గేమ్ సందర్భంగా బ్రెజిల్ క్రీడాకారుడు గాబ్రియేల్ చేసిన స్టంట్.. ఆ స్టంట్ ను తన కెమెరాలో బంధించిన కెమెరామెన్ ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని మాట్లాడిస్తున్నారు.. 

Also Read :- స్కూళ్లకు భారీగా సెలవులు

ఈ ఫొటో చూడండి.. ఈ ఫొటో చూడగానే ఏమనిపిస్తుంది.. ఇదెలా సాధ్యం అయ్యింది అనీ.. ఇంటర్నెట్ ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇలాగే మాట్లాడుతుంది.. నాన్ స్టాప్ ట్రెండింగ్ గా.. వైరల్ అవుతున్న ఈ ఫొటో విశేషాలు ఇలా ఉన్నాయి...మదీనా తరంగాల నుండి బయటపడిన అతని చిత్రం ప్రపంచంలో సంచలనంగా మారుతుంది. తాహితీలో జరిగిన ఈ  రైడ్ ఒలింపిక్స్ చరిత్రలోనే రికార్డ్ కావడం విశేషం.