Champions Trophy 2025: మేం ప్రాణాలకు భయపడలే.. ఎప్పుడు పిలిచినా ఇండియాకు వచ్చాం: ఆఫ్రిది

Champions Trophy 2025: మేం ప్రాణాలకు భయపడలే.. ఎప్పుడు పిలిచినా ఇండియాకు వచ్చాం:  ఆఫ్రిది

ఛాంపియన్స్ ట్రోఫీ వివాదం ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. వాస్తవానికి ఈ టోర్నీ పాక్ వేదికగా జరగాల్సివున్నా.. భారత జట్టు ఆ దేశంలో పర్యటించేందుకు ప్రభుత్వం అనుమతించం లేదు. అందుకు ప్రధాన కారణం.. భద్రత. ఇందులో వాస్తవం లేకపోలేదు. దాయాది దేశంలో ఎప్పుడు, ఎక్కడ బాంబులు పేలతాయో ఎవరూ ఊహించలేరు. ఆ దేశంలో పురుడు పోసుకున్న ఉగ్రవాదం వారికే పెనుముప్పుగా మారింది. ఉగ్రమూకలు ఆత్మహుతి దాడులతో సాధారణ ప్రజల ప్రాణాలూ తీస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో అక్కడ పర్యటించవద్దనేది.. ప్రభుత్వ పెద్దల మాట. 

తాజాగా, ఈ వివాదంపై ఆ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది స్పందించాడు. స్థానిక పాకిస్తాన్ మీడియాతో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఈ మాజీ కెప్టెన్.. భారత్‌లో ఎలాంటి పరిస్థితులు ఉన్నా పాకిస్తాన్ జట్టు పర్యటించిందని గంభీరాలు పలికాడు. ఆఖరికి చెడు సమయాల్లో, తమకు ప్రాణహాని ఉందని బెదిరింపులు వచ్చిన సమయాల్లో కూడా ఇండియాకు వచ్చామని పేర్కొన్నాడు. ఆనాడు ప్రాణాలకు భయపడివుంటే, వచ్చే వాళ్లం కాదని తెలిపాడు. ఇప్పుడు భారతీయులు నిర్భయంగా, ధైర్యంగా పాకిస్థాన్‌ వచ్చి క్రికెట్ ఆడాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపాడు

"హమ్ ఇత్నీ బార్ ఇండియా గయే హై. ముష్కిల్ హలత్ మే గయే. హమే ధమ్కియా భీ మిల్తీ రహీ ఫిర్ భీ హామ్ ఇండియా కే టూర్ కర్తే రహే గవర్నమెంట్ నే ఇనిషియేటివ్ మిల్తా లియా హై అగర్ ఇండియన్ క్రికెట్ బోర్డ్ కి నియాత్ హై పాకిస్తాన్ కే సాత్ చలేన్ కి తో ఆజాయేగా అగర్ నహీ హై, తో నహీ ఆయేగే ఫిర్ సెక్యూరిటీ కో బహానే బనా దేగే.. భారత్‌కు బెదిరింపులు వచ్చాయా..! రాకుండా ఉండటానికి వారు భద్రతను సాకుగా ఉపయోగించుకుంటున్నారు.." అని అఫ్రిది అన్నాడు. 

హైబ్రిడ్ మోడల్

భారత జట్టు చివరిసారిగా 2008లో ఆసియా కప్ సందర్భంగా పాకిస్థాన్ గడ్డపై పర్యటించింది. అనంతరం 26/11 ముంబై ఉగ్రదాడి తర్వాత ఆ దేశాన్ని సందర్శించలేదు. ఈ ఇరు దేశాల మధ్య చివరి ద్వైపాక్షిక సిరీస్ 2006లో జరిగింది. గతేడాది 2023 పాకిస్తాన్‌ వేదికగా జరగాల్సిఉన్న ఆసియా కప్‌ను హైబ్రిడ్ మోడల్ పద్దతితో నిర్వహించారు. దాంతో, భారత జట్టు తమ మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడింది. బీసీసీఐ ఇప్పుడూ అదే కోరుతోంది. పాక్ వచ్చే ప్రసక్తేలేదని, హైబ్రిడ్ మోడల్ పద్దతిలో టోర్నీ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని విన్నవిస్తోంది. అయితే, అందుకు దాయాది దేశ క్రికెట్ బోర్డు పీసీబీ అంగీకరించడం లేదు. ఈ వివాదాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ సైతం ఎటూ తేల్చలేకపోతోంది.