భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే ఫ్యాన్స్ తెగ సీరియస్ గా తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు పాకిస్థాన్, భారత్ కలిసి ఆడడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆఫ్రో–ఆసియా కప్ నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీతో)తో ఆఫిక్రా క్రికెట్ సంఘం ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే భారత్, పాకిస్థాన్ జట్లలోని ఆటగాళ్లు ఒకే జట్టుగా ఆడతారు. కోహ్లీ, బాబర్, షహీన్ ఆఫ్రిది, బుమ్రా లాంటి స్టార్ ఆటగాళ్లను చూసే అవకాశం ఫ్యాన్స్ కు కలుగుతుంది.
క్రికెట్‌లో ఆఫ్రో-ఆసియా కప్ అంటే ఏమిటి?
ఆఫ్రో-ఆసియా కప్ అనేది ఆసియా ఎలెవన్, ఆఫ్రికన్ ఎలెవన్ జట్ల మధ్య జరిగే వైట్-బాల్ క్రికెట్ మ్యాచ్. ఈ టోర్నమెంట్‌లో వన్డే ఇంటర్నేషనల్స్ తో టీ20 మ్యాచ్ లు నిర్వహిస్తారు. ఆసియా ఖండంలోని జట్లన్నీ ఒక జట్టుగా తయారయ్యి ఆఫ్రికా ఖండంలోని జట్టుతో తలపడతాయి. తొలి ఆఫ్రో-ఆసియా కప్ 2005లో దక్షిణాఫ్రికాలో జరిగింది. ఈ మొదటి ఎడిషన్‌లో మూడు వన్డేలు జరిగాయి. ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవగా.. చివరి మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం లేకుండా ముగిసింది. దీంతో రెండు జట్లు ట్రోఫీని షేర్ చేసుకున్నాయి.
Also Read :- ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఆరేళ్ళ తర్వాత కెప్టెన్‌గా వార్నర్
2007 ఆఫ్రో-ఆసియా కప్
ఆఫ్రో-ఆసియా కప్ రెండో ఎడిషన్ 2007లో భారత్‌లో జరిగింది. ఈ టోర్నమెంట్ మూడు వన్డేలతో పాటు ఒక టీ20 మ్యాచ్ జరిగింది. ఈ రెండు ఫార్మాట్ లో ఆసియా ఎలెవన్ ఆధిపత్యం చెలాయించి సిరీస్ గెలుచుకుంది.
ఆఫ్రో-ఆసియా కప్ లో పాల్గొన్న భారత క్రికెటర్లు:
సచిన్ టెండూల్కర్
వీరేంద్ర సెహ్వాగ్
రాహుల్ ద్రవిడ్
మహేంద్ర సింగ్ ధోని
సౌరవ్ గంగూలీ
జహీర్ ఖాన్
అనిల్ కుంబ్లే
యువరాజ్ సింగ్
హర్భజన్ సింగ్
ఇర్ఫాన్ పఠాన్
అనిల్ కుంబ్లే
ఆశిష్ నెహ్రా
మునాఫ్ పటేల్
The Afro-Asia Cup - played between an Asian XI and African XI could see players from India and Pakistan share the same dressing room 🤝
— ESPNcricinfo (@ESPNcricinfo) November 5, 2024
Full story: https://t.co/U9PPKt8klZ pic.twitter.com/DoxGNZkV5x