రాత్రి 12 దాటితే డీజేలు బంద్​ పెట్టాలి..

  •   లేకుంటే చట్టరీత్యా చర్యలు 
  •   వరంగల్‍ పోలీస్‍ కమిషనర్‍ ఏవీ రంగనాథ్‍

వరంగల్‍, వెలుగు:    అర్ధరాత్రి 12 దాటాక డీజేలు, బ్యాండ్‍, ఆర్కెస్ట్రాలు బంద్​ పెట్టాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని  సీపీ రంగనాథ్​ హెచ్చరించారు.  మంగళవారం పోలీస్‍ కమిషనరేట్లో గ్రేటర్‍ పరిధిలోని డీజే, ఆర్కెస్ట్రా, బ్యాండ్‍ వాయిద్యాల ఓనర్లతో  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ.. శుభ కార్యాల పేరుతో అర్ధరాత్రి దాటాక సైతం డీజే సౌండ్‍ పెట్టడంతో 100 డయల్‍కు ఫిర్యాదులు పెరుగుతున్నాయన్నారు. కాలనీల్లో  హెల్త్​ కండీషన్‍ బాగోలేనివారు,  చిన్నపిల్లలు సౌండ్‍ తో  ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సుప్రీం కోర్టు గైడ్​ లైన్స్​ ప్రకారం..  రాత్రి 10 గంటలు దాటితే బ్యాండ్‍, డీజేలు వాడొద్దని, అయినా  ఈ ఫీల్డ్​లో  ఉపాధి పొందుతున్నవారిని దృష్టిలో  పెట్టుకొని రాత్రి 12 గంటల వరకూ చూసి చూడనట్టు   వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. ఫంక్షన్‍ చేసుకునేవారు, డీజేలపై ఆధారపడ్డవారు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవద్దని చెప్పారు.  సమావేశంలో డీసీపీలు అబ్దుల్‍ బారీ, పుల్లా కరుణాకర్‍, స్పెషల్‍ బ్రాంచ్‍ ఏసీపీ తిరుమల్‍, ఇన్స్‍పెక్టర్లు సతీష్‍ బాబు, రాంబాబు, సిబ్బంది పాల్గొన్నారు.