రాష్ట్రంలో వాయిదా పడిన 10వ తరగతి పరీక్షల నిర్వహణకు ఎలాంటి రీ షెడ్యూల్ ప్రకటించలేదని పరీక్షల విభాగం డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. పదో తరగతి పరీక్షల షెడ్యూల్ అంటూ వాట్సాప్ లో వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అలాంటి అలాంటి వార్తలను నమ్మొద్దని సూచించారు. ఈనెల 14 తర్వాత ప్రభుత్వంతో చర్చించి కొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తామని ఆయన తెలిపారు.