
- ఈనెల- 7న స్ట్రక్చర్డ్, 8న జేసీసీ సమావేశాలు
- కార్మికుల సమస్యల పరిష్కారానికి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఫోకస్
గోదావరిఖని/ కోల్ బెల్ట్, వెలుగు: సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఫోకస్చేసింది. ఇందుకు సంస్థ సీఎండీతో ఈనెల7న హైదరాబా ద్సింగరేణి భవన్లో స్ట్రక్చర్డ్ మీటింగ్‌లో భేటీ కానుంది. ఏఐటీయూసీ గెలిచిన తర్వాత15 నెలలకు స్ట్రక్చర్డ్మీటింగ్నిర్వహిస్తుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
అలాగే శనివారం గుర్తింపు (ఏఐటీయూసీ), ప్రాతినిధ్య(ఐఎన్టీయూసీ) సంఘాలతో కలిపి జాయింట్కన్సల్టెంట్ కమిటీ (జేసీసీ) మీటింగ్‌ను నిర్వహించేందుకు మేనేజ్మెంట్ఏర్పాట్లు చేస్తుంది. సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ 2023 డిసెంబర్27న జరిగిన ఎన్నికల్లో గెలిచింది. 2024 సెప్టెంబర్9న గుర్తింపు హోదా పత్రం అందజేశారు.
పెర్క్స్ అలవెన్సులు కార్మికులకు వర్తింపజేసేందుకు..
తొమ్మిదేండ్లుగా కోలిండియాలో ఉద్యోగులకు పెర్క్స్(అలవెన్సుల)పై పన్ను రీయింబర్స్మెంట్ విధానం అమలవుతుంది. దీని వల్ల ఒక్కో కార్మికుడికి రూ.10 వేల నుంచి రూ.20వేల వరకు ఆర్థికంగా లాభం కలుగుతుంది. కోలిండియాలో అమలయ్యే ప్రతి అంశం సింగరేణితో ముడిపడి ఉంటుంది. అక్కడ అమలైతే ఇక్కడ కూడా అమలు చేయాల్సిందే. సింగరేణిలో ఈ విధానాన్ని ఆఫీసర్లకు మేనేజ్మెంట్వర్తింపజేస్తు న్నప్పటికీ కార్మికులను మాత్రం విస్మరిస్తోంది.
ఈ అంశాన్ని పరిష్కరించాలని గుర్తింపు సంఘం డిమాండ్ చేస్తోంది. అదేవిధంగా కోల్ఇండియాలో 'ఓన్ హౌస్అండ్లోన్స్కీమ్' ను250 గజాల భూమి కేటాయింపుతో పాటు రూ.30 లక్షలను హౌస్ బిల్డింగ్అడ్వాన్స్(హెచ్‌బీఏ) కింద 1974 నుంచి ప్రతి కార్మికుడికి కేటాయిస్తున్నారు. సింగరేణిలో మాత్రం అమలు చేయడం లేదు. ప్రస్తుతం కార్మికులు, కుటుంబాల సౌకర్యం కోసం హైదరాబాద్‌లో సింగరేణి ఆధ్వర్యంలో సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్నిర్మించాలి.
లేకుంటే అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందేలా సింగరేణి సంస్థ హెల్త్ కార్డులను అందించాలి. అన్ని గనుల ఆవరణలో రెస్ట్ షెల్టర్లను నిర్మించాలి. కార్మికులు తమ సామగ్రి భద్రపరుచుకునేందుకు లాకర్ల సౌకర్యాన్ని కల్పించాలి. కొన్నేళ్లుగా హోదాలను మార్చకపోతుండగా కార్మికుల్లో ఆత్మన్యూనత నెలకొంది. ఇలాంటి అంశాలపై సింగరేణి సీఎండీ లెవల్లో జరగ