70 ఏళ్ల తర్వాత విదేశాలకు మన బ్లాక్ సాల్ట్ రైస్.. అమెరికా, లండన్ లో డిమాండ్ ఎందుకు..?

70 ఏళ్ల తర్వాత విదేశాలకు మన బ్లాక్ సాల్ట్ రైస్.. అమెరికా, లండన్ లో డిమాండ్ ఎందుకు..?

బ్లాక్ సాల్ట్ రైస్.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్న స్పెషల్ రైస్.. జబర్దస్త్ పోషకాలు..టేస్ట్ కు టేస్ట్ ..సువాసన  ఉన్న ఈ నల్ల ఉప్పు బియ్యం అమెరికా, లండన్ కు ఎగుమతికి సిద్దంగా ఉన్నాయి. ఇంతకీ ఈ బ్లాక్ సాల్ట్ రైస్ ఉన్న గొప్పతనం ఏంటీ.. ఎందుకు దేశ విదేశాల్లో వాటికి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు.? ఈ బ్లాక్ సాల్ట్ రైస్ చరిత్ర, ఉత్పత్తి, ఉపయోగాల గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. 

బ్లాక్ సాల్ట్ రైస్.. యూపీ ప్రభుత్వం వన్ డిస్ట్రిక్ట్..వన్ ప్రాడక్ట్ (ODOP) గా ప్రకటించిన తర్వాత బ్లాక్ సాల్ట్ రైస్ కు డిమాండ్ పెరిగింది. రుచిలోనూ, వాసనలోనూ సాటిలేనివి. పౌష్టికాహారంలో సాధారణ బియ్యం కంటే చాలా శ్రేష్టమైనవి.. యూపీలో వీటిని కాలనమక అని పిలుస్తారు. యూపీ లోని సిద్ధార్థ నగర్ లో వీటి పుట్టుక, చరిత్ర మొదలైంది. యోగి ప్రభుత్వం ఓడీఓపీ ప్రకటించిన తర్వాత దేశ విదేశాల్లో వీటి క్రేజ్ బాగా పెరిగిపోయింది. బ్లాక్ సాల్ట్ రైస్ సాగు విస్తీర్ణం, దిగుబడి కూడా బాగా పెరిగింది. 

మూడేళ్ళలో ఎగుమతులు మూడురెట్లు పెరిగాయి

2021తో పోలిస్తే బ్లాక్ సాల్ట్ రైస్ ఉత్పత్తి 2024నాటికి మూడు రెట్లు పెరిగింది. పద్మశ్రీ అవార్డు పొందిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఆర్ సి చౌదరి ఆధ్వర్యంలో పీఆర్డీఎఫ్ (పార్టిసిపేటరీ రూరల్ డెవలప్ మెంట్ ఫౌండేషన్ ), గోరఖ్ పూర్ కలసి ఈ పౌష్టికాహారం అయిన బ్లాక్ సాల్ట్ రైస్ ను ఉత్పత్తి చేస్తుననారు. గత రెండేళ్లలో సింగపూర్ కు 55 టన్నులు, నేపాల్ కు 10 టన్నుల  నల్లఉప్పు బియ్యాన్ని ఎగుమతి చేశారు. ఈ డేటా స్వయంగా 17 డిసెంబర్ 2021న రాజ్యసభలో ప్రకటించబడింది. 

వీటితోపాటు దుబాయ్, జర్మనీకి కూడా ఎగుమతి చేశారట.. పీఆర్ డీఎఫ్ కాకుండా అనేక సంస్థలు కూడా నల్ల ఉప్పు బియ్యాన్ని ఎగుమతి చేయడానికి సిద్దమయ్యాయి. రానున్న కాలంలో ఈ బియ్యం డిమాండ్ మరింత పెరగనుంది.  

సాగు విస్తీర్ణం కూడా పెరిగింది.. 

2023లో బ్లాక్ సాల్ట్ రైస్ సాగు విస్తీర్ణం దాదాపు 80వేల హెక్టార్లకు పెరిగింది. 2024 నాటికి లక్ష హెక్టార్లకు పెరగనుందంటున్నారు. గణాంకాల ప్రకారం..  గడిచిన ఏడేళ్లలో దాదాపు నాలుగు రెట్లకు సాగు పెరిగింది. 2016లో కేవలం 2200 హెక్టార్లు మాత్రమే ఉండగా.. 2022లో 70వేల హెక్టార్లు.. 2023లో 80వేల హెక్టార్లకు చేరింది. ఇప్పుడు యూపీలోనే కాదు మిగతా రాష్ట్రాల్లో కూడా బ్లాక్ సాల్ట్ రైస్ సాగుకు రైతులు మొగ్గుచూపుతున్నారట. 

మిగతా బియ్యం కంటే బ్లాక్ సాల్ట్ రైస్ ఎందుకు మంచివి.. 

బ్లాక్ సాల్ట్ రైస్ లో బీటా కెరోటిన్ రూపంలో విటమిన్ ఏ  లభిస్తుంది.. ఇలా ఏ విటమిన్ లభించే ఏకైక సహబియ్యం .. నల్ల ఉప్పుబియ్యం. ఇతర బియ్యంతో పోలిస్తే ప్రోటీన్, జింక్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. జింక్ మెదడుకు, ప్రతి వయసులో శరీర అభివృద్ది తోడ్పడుతుంది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా((49 నుండి 52%) ఉంది..దీని వల్ల డయాబెటిక్ పేషెంట్లకు ఇతర బియ్యం కంటే చాలా మేలైనవి. 

బ్లాక్ సాల్ట్ రైస్ చరిత్ర 

బ్రిటీష్ పాలన కాలంలో యూపీ ప్రాంతలో ఈ బ్లాక్ సాల్ట్ రైస్ ను ఎక్కువగా పండించేవారట.. బర్డ్ ఘాట్, కాంపియర్ గంజ్, సిద్ధార్థ నగర్ వంటి ప్రాంతాల్లో బ్రిటీష్ వాళ్లకు చెందిన ఫాం హౌజ్ లలో ఈ నల్ల ఉప్పు బియ్యాన్ని సాగు చేసేవారు. నల్ల ఉప్పు రుచి, వాసన గురించి బ్రిటీస్ వారికి బాగా తెలుసు. ఈ లక్ష ణాల కారణంగా నల్ల ఉప్పు బియ్యానికి ఇంగ్లాండ్ లో మంచి ధర పలికేదట. అప్పట్లో ఓడల ద్వారా ఇంగ్లాండ్ కు ఈ బియ్యాన్ని ఎగుమతి చేపేవారు. సుమారు ఏడు దశాబ్దాల తర్వాత అంటే జమీందారీ వ్యవస్థ రద్దు, స్వాతంత్ర్యం అనంతరం ఈ ధోరణి క్రమంగా తగ్గుముఖం పట్టి క్రమంగా ఎగుమతులు ముగిశాయి. అయితే 2024 లో తొలిసారి 5 క్వింటాళ్ల బియ్యాన్ని ఇంగ్లాండ్ , అమెరికాకు ఎగుమతి చేసేందుకు యూపీ సర్కార్ ఏర్పాట్లు చేసింది.

ఎగుమతులు పక్కన పెడితే.. మంచి పోషకాలున్న ఈ బియ్యాన్ని దేశంలోని అన్ని ప్రాంతాల్లో సాగుకు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తే ఎంతో బాగుంటుందని.. ఈ బ్లాక్ సాల్ట్ రైస్ గురించి విన్నవారంతా కోరుకుంటున్నారు. వారి కోరిక నెరవేరాలని ఆశిద్ధాం..