Viral Video: భూ వివాదంలో మహిళపై దాడి.. వీడియో వైరల్.. టీఎంసీ నేత అరెస్ట్

Viral Video: భూ వివాదంలో మహిళపై దాడి.. వీడియో వైరల్.. టీఎంసీ నేత అరెస్ట్

కోల్కతా: భూ వివాదంలో ఓ మహిళపై దాడి చేసినందుకు టీఎంసీ ప్రధాన కార్యదర్శి గోపాల్​ తివారీని బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగాల్లోని కల్నాలో మహిళపై ఆయన దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. మహిళ ఇంటికి ఆనుకుని ఉన్న జాగాలో తివారీ కాంపౌండ్  కట్టించారు. సరిహద్దు విషయంలో మహిళ వాగ్వాదానికి దిగడంతో తివారీ ఆమె ఇంట్లో చొరబడి ఆమెను కొట్టారు. దీనిపై మహిళ ఫిర్యాదు, దాడికి సంబంధించిన వీడియో ఆధారంగా తివారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

‘‘టీఎంసీ నేత మా ఇంటి జాగలోంచే గోడ కట్టిస్తున్నడు. ప్రశ్నించినందుకు ఇంట్లోకి వచ్చి నన్ను చెప్పుతో కొట్టాడు. తివారీ అనుచరులు 50 మంది దాకా వచ్చి ఇంట్లోకి చొరబడి నన్ను, నా కూతురు, అత్తపైనా దాడి చేశారు”అని ఆ మహిళ తెలిపింది.