ఈడీ చార్జిషీట్ పై సీఎం కేసీఆర్‭తో కవిత భేటీ

ఈడీ చార్జిషీట్ పై సీఎం కేసీఆర్‭తో కవిత భేటీ

సీఎం కేసీఆర్ తో ప్రగతి భవన్ లో ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. లిక్కర్ కేసులో  ఈడీ చార్జిషీట్, అలాగే ఇటీవలి పరిణామాలు, సీబీఐ దర్యాప్తు విషయాలపై లీగల్ ఎక్స్ పర్ట్స్‭తో చర్చించనున్నట్లు తెలిసింది. 

ఇదిలా ఉంటే.. లిక్కర్ స్కామ్‭లో ఈడీ రెండో చార్జ్ షీట్ లో కవిత పేరును ప్రస్తావించిన విషయం తెలిసిందే. సమీర్ మహేంద్రపైన ఈడీ దాఖలు చేసిన ఈ చార్జిషీట్ లో సంచలన విషయాలు పేర్కొంది.  టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఏపీకి చెందిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్లను ఈ చార్జిషీటులో ఈడీ పేర్కొంది. సమీర్ కంపెనీలో కవితకు వాటాలు ఉన్నట్లు కూడా ఈడీ వెల్లడించింది. దీనిపై కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు.