అభిషేక్, ఐశ్వర్యలు రూమర్లకు చెక్ చెప్పినట్లేనా..?

బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడిపోతున్నారంటూ గత కొంత కాలంగా టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ల వివాహ వేడుకకు ఇద్దరూ విడివిడిగా రావటంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. అభిషేక్, ఐశ్వర్య విడిపోవటం నిజమే అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే, రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టేలా తాజాగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్నాయి.

అనంత్ రాధికల పెళ్ళికి విడివిడిగా వచ్చినప్పటికీ ఫంక్షన్ లో అభిషేక్, ఐశ్వర్యలు ఒకే చోట కూతురు ఆరాధ్యతో కలిసి కూర్చున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ విడిపోలేదని కలిసే ఉన్నారంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే, తమపై వస్తున్న రూమర్స్ పై అభిషేక్ కానీ, ఐశ్వర్య కానీ..  డైరెక్ట్ గా స్పందించకపోయినా ఆ మధ్య కూతురు ఆరాధ్యతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి రూమర్స్ కి చెక్ చెప్పే ప్రయత్నం చేశారు.

Also Read:-ఎట్టకేలకు ఓటీటీలోకి మలయాళ బ్లాక్ బస్టర్-మారిన ప్లాట్‌ఫామ్-స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

ఇప్పుడు అంబానీల పెళ్లికి కలిసి రాకపోయినా ఒకే చోట కలిసి కూర్చొని మరోసారి రూమర్స్ కి చెక్ చెప్పారు ఐశ్వర్య, అభిషేక్ లు.మరి, ఇకనైనా ఈ స్టార్ కపుల్ పై వస్తున్న రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి.