అదానీకో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయం ?

  • ప్రధానిని  బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్, వెలుగు: జైలు నుంచి విడుదలై వచ్చాక బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కవిత తొలిసారి రాజకీయ వ్యాఖ్యలు చేశారు. అదానీ వ్యవహారంపై కేంద్రాన్ని గురువారం నిలదీశారు. లిక్కర్​ స్కామ్​లో తనను అరెస్ట్​ చేసి జైల్లో పెట్టడం, అదానీపై ఆరోపణలొస్తున్నా చర్యలు తీసుకోకపోవడాన్ని పోలుస్తూ విమర్శలు గుప్పించారు.

‘ఎన్ని ఆరోపణలు వచ్చినా అదానీవైపే ప్రధాని ఉంటారా? భారత్​లో అదానీకో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా? ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్​ చేయడం ఈజీ. కానీ, అన్ని ఆధారాలూ ఉన్నా అదానీని అరెస్ట్​ చేయడం మాత్రం కష్టమా’’ అని ఆమె ప్రధానిని ప్రశ్నిస్తూ  గురువారం ట్వీట్​ చేశారు.