నీట్ పేపర్ లీక్ కేసు బీహర్ నుంచి మహారాష్ట్రకు..కీలక నిందితుడు అరెస్ట్  

నీట్ పేపర్ లీక్ కేసు బీహర్ నుంచి మహారాష్ట్రకు..కీలక నిందితుడు అరెస్ట్  

నీట్ పేపర్ లీక్ వ్యవహారం బీహార్ నుంచి మహారాష్ట్రకు పాకింది. ఆదివారం ఉదయం యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఎటిఎస్) లాతోర్ ప్రాంతంలో ఈ స్కామ్‌కు సంబం ధించి ఉపాధ్యాయులతో సహా పలువురిని ప్రశ్నించింది. మహారాష్ట్రలోని లాతూర్ కు చెందిన సంజయ్ తుకారాం జాదవ్, జలీల్ ఉమర్జాన్ పఠాన్ అనే ఇద్దరికి ఈ కేసుతో సంబంధమున్నట్లు గుర్తించారు. వీరిద్దరు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు. ఇద్దరు నిందితులు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను కూడా నడుపుతున్నారు. 

జలీల్ ఉమర్ఖాన్ పఠాన్‌ను గంటల తరబడి విచారించిన నాందేడ్ యాంటీ టెరర్రిస్ట్ స్క్వాడ్ ఆదివారం అరెస్టు చేసింది. సంజయ్ తుకారాం జాదవ్ పరారీలో ఉన్నా డు. పలువురు  విద్యార్థుల ఫోన్లలో అడ్మిట్ కార్డులు, వాట్సాప్ చాట్ లను పోలీసులు గుర్తించారు. ఇద్దరు వ్యక్తులు ఢిల్లీలో ఓ వ్యక్తితో రెగ్యులర్ కాంటాక్ట్ లో ఉన్న ట్లు గుర్తించారు. ఢిల్లీ కి చెందిన గంగాధర్..సంజయ్ తుకారాం జాదవ్, జలీల్ ఉమర్జాన్ పఠాన్ లను విద్యార్థులు కలిసేలా సహాయం చేశాడని తెలుస్తోంది. 

ఈ కేసులో మహారాష్ట్ర పోలీసులు గంగాధర్ తోపాటు నాందేడ్ కోచింగ్ సెంటర్లో ట్రైనర్ ఈరన్న కొంగళ్వార్ లపై ఎఫ్ ఐఆర్ నమోదు అయింది. ఫ్రాండ్, నేరపూరిత కుట్ర ఆరోపణలతో కేసు నమోదు చేశారు. 

ఈ కేసులో ఇప్పటివరకు తీసుకున్న చర్యలు 

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్‌ను కేంద్రం శనివారం తొలగించింది. మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్-యుజిలో అవకతవకలపై దర్యాప్తును సిబిఐకి అప్పగించింది.

విద్యా మంత్రిత్వ శాఖ కూడా ఏజెన్సీ పనితీరును సమీక్షించడానికి , పరీక్ష సంస్కరణలను సిఫార్సు చేయడానికి ఇస్రో మాజీ చీఫ్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. దీంతోపాటు NEET-PG ప్రవేశాన్ని వాయిదా వేసింది.

ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ITPO) ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ సింగ్ ఖరోలాకు  NTA అదనపు బాధ్యతను కేటాయించారు.

వివాదం ఏంటంటే.. 

మే 5, 2024న నీట్ పరీక్ష2024 ను నిర్వహించారు. దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు 4వేల 750 కేంద్రాల్లో పరీక్ష రాశారు. ఫలితాలు జూన్ 14న ప్రకటించాల్సి ఉండ గా.. జూన్ 4 న ప్రకటించారు. NTA చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 67 మంది విద్యార్థులు720 మార్కులతో  టాప్ స్కోరర్లుగా నిలిచారు. హర్యానాలోని ఫరీదాబాద్ కు చెందిన ఓ ఎగ్జామ్ సెంటర్ నుంచి పరీక్ష రాసిన ఆరుగురు టాప్ లిస్ట్ లో ఉన్నారు. దీంతో నీట్ ఎగ్జామ్ లో అక్రమాలు జరిగాయని, పేపర్ లీక్ అయ్యిందని అను మా నాాలు తలెత్తాయి. 

ఆరు సెంటర్లలో సమయం వృధా అయిందంటూ విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వడంపై కూడా వివాదం నెలకొంది. గ్రేస్ మార్కులను రద్దు చేస్తున్నామని..ఈ 1,563 మంది విద్యార్థులకు మళ్లీ పరీక్షకు అవకాశం కల్పిస్తామని కేంద్రం తర్వాత సుప్రీంకోర్టుకు తెలిపింది.ఈ విద్యార్థులకు ఎన్‌టీఏ ఆదివారం మళ్లీ పరీక్ష నిర్వ హించింది.