Earthquake: వణికిస్తున్న భూకంపాలు.. ఢిల్లీ తర్వాత బీహార్, ఒడిషాలోనూ ప్రకంపనలు

Earthquake: వణికిస్తున్న భూకంపాలు.. ఢిల్లీ తర్వాత బీహార్, ఒడిషాలోనూ ప్రకంపనలు

నార్త్ ఇండియాలో భూకంపాలు వణికిస్తు్న్నాయి. మంగళవారం (ఫిబ్రవరి 17) తెల్లవారు జామున 5.30 గంటల ప్రాంతలో 4.0 తీవ్రతతో వచ్చిన ఎర్త్ క్వేక్ ఢిల్లీని వణికించింది. భూకంపంతో ప్రజలు నిద్రలేచి ఇళ్లలోనుంచి పరుగులు తీశారు. ఢిల్లీ భూకంప భయం నుంచి ప్రజలు అప్పుడప్పుడే కోలుకుంటున్న సమయంలో బీహార్, ఒడిషా రాష్ట్రాలలోనూ భూకంపాలు సంభవించడం దేశవ్యాప్తంగా ప్రజలను ఆందోళనలకు గురి చేస్తోంది. 

బీహార్ లో ఉదయం 8 గంటల 2 నిమిషాలకు రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. సివాన్ పట్టణంలో వచ్చిన ప్రకంపనలతో జనాలు భయాందోళనలకు గురయ్యారు. అప్పటి దాకా ఢిల్లీ భూకంపం గురించి వార్తలు వింటున్న ప్రజలు నేరుగా తమ ప్రాంతంలోనూ భూమి కంపించడంతో ఒక్కసారిగా పరుగులు తీశారు. 

ఇక ఒడిషాలోనూ భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనాలు ఇళ్లు వదిలేసి బయటకు వచ్చేశారు. 

ఇండియాలో వస్తున్న వరుస భూకంపాలపై ప్రధాని మోదీ మాట్లాడారు. భూకంపాలు మళ్లీ వచ్చే అవకాశం ఉందని, జనాలు ఆందోళకు గురి కావద్దని సూచించారు. అధికారుల సలహాలు తప్పకుండా పాటించి జాగ్రత్తలు తీసుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.