ఇది చారిత్రాత్మకమైన తీర్పు: పవన్ కళ్యాణ్​

ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్​ ప్రజలు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారని పవన్​ అన్నారు.  వైసీపీ వారు కాని, వైఎస్​ జగన్​ కాని వ్యక్తిగతంగా నాకు శత్రువులు కాదన్నారు.  ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటామన్నారు.  భవిష్యత్తు తరాల కోసం  భుజాన వేసుకొని రాజకీయం చేస్తామన్నారు.

నా జీవితంలో ఇప్పటి వరకు తనకు విజయం తెలియదన్నారు.  నా జీవితం అంతా మాటలు పడ్డానన్నారు.  భారతదేశంలో 100 కి 100 శాతం గెలిచిన పార్టీ జనసేన అన్నారు.  5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష మేరకు మార్పు కావాలి.. పాలన మారాలి.. ఇది కక్ష సాధింపు చర్యకు సమయం కాదన్నారు. ఆంధ్రప్రదేశ్​భవిష్యత్తుకు పునాది వేసే సమయం..అన్నం పెట్టే రైతుకు అండగా ఉండే సమయం.. ఆడబిడ్డలకు రక్షణ కల్పించే సమయం..జవాబు దారీ తనంతో పని చేస్తానన్నారు.

మెగా డీఎస్సీ నోటిఫికేషన్​ విడుదల చేసే బాధ్యత తీసుకుంటా..  ప్రజలు నాకు చాలా బాధ్యత ఇచ్చారు.  175 సీట్లు గెలిస్తే ఎంత బాధ్యత ఉంటుందో అంత బాధ్యతతో పని చేస్తానన్నారు. ఏపీకి చీకటి రోజులు ముగిసాయన్నారు. యువత ఎంతో నలిగిపోయారన్నారు. నాకు డబ్బు.. రాజకీయాలు అవసరం లేదంటూ.. 2019 లో ఓడిపోయినప్పుడు నా రాజకీయ స్థితి ఎలా ఉందో.. ఇప్పుడు కూడా అలానే ఉందన్నారు.  ఇల్లు అలకగానే పండుగ కాదంటూ...  పరాజయం చూసి భయపడనన్నారు. ధర్మం కోసం నిలబడ్డా.. ఇప్పుడు ధర్మం నాపక్కన ఉందన్నారు. పిఠాపురం ప్రజలకు.. కథం తొక్కిన యువతకు, టీడీపీ నాయకులకు కృతఙ్ఞతలు తెలిపారు. పిఠాపురం ప్రజలు 5 కోట్ల మంది ప్రజలను గెలిపించారన్నారు. నిలబడతాం.. నిర్మాణాత్మకంగా పని చేస్తాం.. మీ ఇంట్లో ఒక సభ్యుడిగా నిలబడతానన్నారు.