దేశవ్యాప్తంగా సీఆర్ పీఎఫ్ స్కూళ్లలో ఒకేసారి బాంబులు పెడుతున్నట్లు బెదిరింపు మెసేజ్ లు పంపించారు గుర్తుతెలియని దుండగులు. ఢిల్లీలోని రెండు, హైదరా బాద్ లోని ఒకటి సహా దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ స్కూళ్లకు ఈమెయిల్స్ ద్వారా బెదింరిపు మేసేజ్ పంపించారు.ఈ మెయిల్స్ సోమవారం అర్థరాత్రి పంపించినట్టు స్కూల్స్ యాజమాన్యం చెబుతోంది.
దీంతో అలెర్ట్ అయిన పోలీసులు ఆయా స్కూళ్లలో భద్రతపరమైన తనిఖీలు చేస్తున్నారు. దీంతో పాటు తమిళనాడులోని కోయంబత్తూరు లోని చిన్న వెడంపట్టి , శరవణం పట్టిలో రెండు ప్రైవేట్ పాఠశాలలకు గుర్తు తెలియన వ్యక్తులు మంగళవారం బాంబు బెదిరింపు ఈమెయిల్స్ పంపించారు.
ALSO READ | Hyderabad: సీఆర్పీఎఫ్ స్కూల్ కు బాంబ్ బెదిరింపు..
ఢిల్లీలో ఆదివారం బాంబు పేలుడు తర్వాత తాజాగా దేశవ్యాప్తంగా సీఆర్ ఫీఎఫ్ స్కూళ్లకు, ఇతర కళాశాలకు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. హైదరాబాద్ లోని జవహర్ నగర్ లో సీఆర్ పీఎఫ్ స్కూల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.