మాస్కో: రష్యా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లూనా 25 మూన్ మిషన్ ఫెయిల్యూర్ తర్వాత ఆ దేశ సైంటిస్ట్ మిఖాయిల్ మారోవ్(90) ఆస్పత్రి పాలయ్యారు. రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్ కాస్మోస్ పంపిన లూనా 25 స్పేస్ క్రాఫ్ట్ ఈ నెల 20న చంద్రుడి ఉపరితలంపై కూలిపోయింది. ఇది తెలిసి మారోవ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను మాస్కోలోని ఆస్పత్రికి తరలించారు.
మంగళవారం ఆస్పత్రిలో మీడియాతో మారోవ్ మాట్లాడారు. ‘‘ప్రస్తుతం నేను అబ్జర్వేషన్లో ఉన్నాను. లూనా 24 ఫెయిల్యూర్తో చాలా బాధపడుతున్నా. స్పేస్ క్రాఫ్ట్ క్రాష్ ల్యాండ్ కావడంతో దు:ఖాన్ని తట్టుకోలే కపోతున్నా. లూనా 25 వైఫల్యానికి గల కారణాలపై సైంటిస్టులు చర్చిస్తారని ఆశిస్తున్నాను” అని మారోవ్ చెప్పారు.