రైతులకు గుడ్ న్యూస్.. నాలుగేండ్ల తర్వాత డ్రిప్‌ సబ్సిడీ ‌స్కీమ్ మళ్లీ షూరు

రైతులకు గుడ్ న్యూస్.. నాలుగేండ్ల తర్వాత డ్రిప్‌ సబ్సిడీ ‌స్కీమ్ మళ్లీ షూరు

మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌/చిన్నచింతకుంట, వెలుగు: గత ప్రభుత్వం నాలుగేండ్ల కింద పక్కన పెట్టిన డ్రిప్‌‌‌‌, స్ర్పింక్లర్ల సబ్సిడీ స్కీమ్‌‌‌‌‎ను కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. డ్రిప్‌‌‌‌ అవసరం ఉన్న  రైతులు హార్టికల్చర్‌‌‌‌ఆఫీసర్లకు అప్లికేషన్‌‌‌‌ పెట్టుకుంటే ఈ యాసంగి సీజన్‌‌‌‌ నుంచే మంజూరు చేస్తోంది. 

యూనిట్‌‌‌‌కాస్ట్‌‌‌‌ పెరగడంతో సబ్సిడీ బంద్‌‌‌‌పెట్టిన బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌

డ్రిప్‌‌‌‌, స్ర్పింక్లర్ల యూనిట్‌‌‌‌కాస్ట్‌‌‌‌ ప్రతి ఐదేండ్లకు ఒకసారి పెరుగుతూ ఉంటుంది. 2021-– 22లో పీవీసీ పైపుల కంపెనీలు రేట్లు పెంచడంతో ఆ సంవత్సరం నుంచి డ్రిప్‌‌‌‌, స్రింక్లర్ల యూనిట్‌‌‌‌ కాస్ట్‌‌‌‌ రూ. 1.25 లక్షలకు చేరుకుంది. ఇందులో కేంద్రం 60 శాతం వాటా చెల్లిస్తుండగా, మిగతా 40 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. అయితే యూనిట్‌‌‌‌ కాస్ట్‌‌‌‌ పెరగడం, డ్రిప్‌‌‌‌ మంజూరు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో అప్‌‌‌‌డేట్‌‌‌‌ చేయాల్సి ఉండగా బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో కేంద్రం నుంచి వచ్చే సబ్సిడీ నిధులు ఆగిపోయాయి. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం కూడా తన వాటా నిధుల విడుదల నిలిపివేయడంతో 2021-–22 నుంచి డ్రిప్‌‌‌‌ సబ్సిడీ బంద్‌‌‌‌ అయింది. అప్పటి నుంచి రైతులే తమ సొంత ఖర్చులతో డ్రిప్‌‌‌‌ తెచ్చుకొని తోటలు సాగు చేస్తున్నారు. 

సబ్సిడీని పునరుద్ధరించిన కాంగ్రెస్‌‌‌‌

తెలంగాణలో గతేడాది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం ఆరుతడి, వాణిజ్య పంటలు సాగుకు ప్రోత్సాహం అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నాలుగేండ్ల కింద నిలిచిపోయిన డ్రిప్‌‌, స్ర్పింక్లర్ల సబ్సిడీని పునరుద్ధరించింది. ఇందులో భాగంగా తన వాటా నిధుల ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు ప్రతి జిల్లాకు మొదటి విడతలో పెద్ద మొత్తంలో యూనిట్లు మంజూరు చేసింది. అప్లికేషన్లు పెట్టుకున్న రైతులకు వెంటవెంటనే మంజూరు చేస్తోంది. ఇంకా ఎన్ని యూనిట్లు అవసరం ఉన్నాయో ప్రపోజల్స్‌‌‌‌ పంపాలంటూ హార్టికల్చర్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ఆఫీసర్లకు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లాల వారీగా ప్రపోజల్స్‌‌‌‌ రెడీ చేసిన ఆఫీసర్లు వాటిని ప్రభుత్వానికి పంపించారు.

పాలమూరులో టార్గెట్ పూర్తి

మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ జిల్లాకు ఈ ఏడాది జనరల్‌‌‌‌ డ్రిప్‌‌‌‌ కింద 468 హెక్టార్లకు రూ.4.26 కోట్ల టార్గెట్‌‌‌‌ విధించారు. దీంతో ఈ మొత్తానికి హార్టికల్చర్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ నుంచి గత జూన్‌‌‌‌లో పర్మిషన్‌‌‌‌ తీసుకుంది. జూలై నుంచి అవసరం ఉన్న రైతుల నుంచి అప్లికేషన్లు తీసుకుంది. ఇప్పటి వరకు జనరల్‌‌‌‌ డ్రిప్‌‌‌‌ కింద 404 మంది అప్లికేషన్లు పెట్టుకోగా, వీరికి మూడు విడతల్లో డ్రిప్‌‌‌‌ను మంజూరు చేశారు. ఇప్పటివరకు వంద శాతం టార్గెట్ పూర్తి అయింది. రెండో విడత డ్రిప్‌‌‌‌ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపోజల్స్‌‌‌‌ పంపించారు. అలాగే 1,351 యూనిట్ల స్ర్పింక్లర్లు కూడా మంజూరు అయ్యాయి. వీటికోసం ఇప్పటివరకు 25 మంది రైతులు అప్లై చేసుకున్నారు.

‌‌‌సబ్సిడీ ఇచ్చేది ఇలా... 

రాష్ట్ర ప్రభుత్వం డ్రిప్‌‌‌‌పై ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీ ఇస్తుంది. బీసీ, ఓసీ రైతులకు 90 శాతం సబ్సిడీ వర్తిస్తుంది. అయితే ఓసీలో ఐదు ఎకరాలకు మించి భూమి ఉన్న రైతులకు 80 శాతం సబ్సిడీ వర్తిస్తుంది. ఏడు శాతం జీఎస్టీని మాత్రం రైతులే భరించాల్సి ఉంటుంది. స్ప్రింక్లర్ల కోసం అన్ని వర్గాల రైతులకు 75 శాతం సబ్సిడీ అందజేస్తుంది. దీనికి కూడా ఏడు శాతం జీఎస్టీ రైతులే చెల్లించాలి.

ఏడేండ్లు ఎదురుచూసిన.. 

నాకు మూడున్నర ఎకరాల భూమి ఉంది. మిర్చి సాగు చేసేందుకు డ్రిప్‌‌‌‌ కోసం ఏడేండ్లు ఎదురుచూసిన. డ్రిప్‌‌‌‌ కోసం బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పాలనలోనే అప్లికేషన్‌‌‌‌ పెట్టుకున్నా మంజూరుకాలేదు. ప్రైవేట్ల అడిగితే  రూ.3.55 లక్షలు అయితయన్నారు. అన్ని డబ్బులు లేకపోవడంతో డ్రిప్ పెట్టుకోలె, మిర్చి సాగు చేయలే. కాంగ్రెస్ ప్రభుత్వం డ్రిప్‌‌‌‌కు సబ్సిడీ ఇస్తుందని తెలియడంతో అప్లికేషన్‌‌‌‌ పెట్టుకున్న. సబ్సిడీ కింద రూ.38 వేలకే డ్రిప్ మంజూరైంది. మిర్చి పంట కూడా పెట్టిన.
- వెంకటేశ్వరమ్మ, రైతు, వడ్డేమాన్‌‌‌‌ గ్రామం, మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ జిల్లా

వెయ్యి హెక్టార్లకు ప్రపోజల్స్‌‌‌‌పెట్టాం 

మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ జిల్లాలో జనరల్‌‌‌‌ డ్రిప్‌‌‌‌ కింద మొదటి విడతలో ఈ ఏడాది ఇచ్చిన టార్గెట్‌‌‌‌ను పూర్తి చేశాం. ఇది కాకుండా 500 హెక్టార్లలో ఆయిల్‌‌‌‌పామ్‌‌‌‌ టార్గెట్‌‌‌‌ వచ్చింది. ఇందులో 175.5 హెక్టార్లకు డ్రిప్ మంజూరు చేశాం. 160 హెక్టార్లలో చెరుకు తోటలకు టార్గెట్‌‌‌‌ ఇచ్చారు. ఇంకా ప్లాంటేషన్‌‌‌‌ ప్రారంభం కాలేదు. 15 రోజుల్లో ప్లాంటింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు రైతుల నుంచి అప్లికేషన్లు తీసుకొని యూనిట్లు మంజూరు చేస్తాం. రెండో విడత జనరల్‌‌‌‌ డ్రిప్‌‌‌‌ కోసం వెయ్యి హెక్టార్లకు ప్రపోజల్స్‌‌‌‌ పంపించాం.
- కోదాటి వేణుగోపాల్, హార్టికల్చర్‌‌‌‌ అండ్‌‌‌‌ సెరికల్చర్‌‌‌‌ డీడీ, మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌

ఈమె పేరు బాలేశ్వరమ్మ. చిన్నచింతకుంటకు చెందిన ఈమెకు 4.14 ఎకరాల భూమి ఉంది. ఇప్పటి వరకు ప్రైవేట్‌‌‌‌గానే డ్రిప్‌‌‌‌ కొనుగోలు చేశారు. గతేడాది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం డ్రిప్ మంజూరు చేయకపోవడంతో సుమారు రెండున్నర లక్షలు ఖర్చు చేసి డ్రిప్‌‌‌‌ కొన్నారు. కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం సబ్సిడీ కింద డ్రిప్‌‌‌‌ ఇస్తున్నట్లు తెలియడంతో గత జులైలో అప్లికేషన్‌‌‌‌ పెట్టుకుంది. మొత్తం 4.14 ఎకరాలకు అవసరమైన డ్రిప్‌‌‌‌ కోసం సబ్సిడీ పోను రూ.48 వేలు కట్టింది. డ్రిప్‌‌‌‌ మంజూరు కావడంతో గత నెలలోనే ఇన్స్‌‌‌‌స్టాలేషన్‌‌‌‌ పూర్తి అయింది.