కాలేజీలకు ఒళ్లంతా కప్పుకుని రండి.. చిరిగిన జీన్స్, టీ షర్ట్ బ్యాన్

కాలేజీలకు ఒళ్లంతా కప్పుకుని రండి.. చిరిగిన జీన్స్, టీ షర్ట్ బ్యాన్

దేశ వాణిజ్య రాజధాని ముంబై నగరంలోని కాళాశాలల్లో కఠిని నియమాలు అమలు చేస్తుంది యాజమాన్యం. సోమవారం చెంబూర్‌లోని ఆచార్య & మరాఠే కళాశాల విద్యార్థులు జీన్స్‌, టీ షర్టు ధరించి కళాశాలలోకి రాకుండా అడ్డుకున్నారు కళాశాల యాజమాన్యం. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.  జూన్ 27 2024 నాడు డ్రెస్ కోడ్ పేరుతో కాలేజీ యాజమాన్యం ఓ నోటీసు విడుదల చేసింది. 

నోటీసులో.. విద్యార్థులు క్యాంపస్‌లో ఉన్నప్పుడు  చిరిగిన జీన్స్, టీ-షర్టులు, బహిర్గతమయ్యే దుస్తులు, జెర్సీలు దరించవద్దని.. ఫార్మల్.. లేదా డిసెంట్ డ్రెస్ ధరించాలని రాసి ఉంది. అమ్మాయిలు ఏదైనా భారతీయ లేదా పాశ్చాత్య దుస్తులను ధరించవచ్చని.. మతం.. సాంస్కృతిక అసమానతలను చూపించే ఎలాంటి దుస్తులు ధరించకూడదని నోటీసులో తెలిపారు. నకాబ్, హిజాబ్, బుర్ఖా, స్టోల్, క్యాప్, బ్యాడ్జ్ లాంటి డ్రెస్ లు గ్రౌండ్ ఫ్లోర్‌లోని సాధారణ గదులకు వెళ్లడం ద్వారా తొలగించాలని ఆపై మాత్రమే కాలేజీ క్యాంపస్ లోకి అనుమతి ఇవ్వబడుతుందని వెల్లడించారు.  

 హిజాబ్‌ను నిషేధించిన ఇన్‌స్టిట్యూట్ డ్రెస్ కోడ్‌ను సవాలు చేస్తూ కాలేజీ విద్యార్థులు బాంబే హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కొన్ని రోజులకు కాలేజీ యాజమాన్యం జీన్స్, టీ-షర్ట్‌లను నిషేధిస్తూ కాలేజీ కొత్త డ్రెస్ కోడ్‌ను జారీ చేసింది. కాలేజీ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల విధ్యార్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.  కానీ యాజమాన్యం మాత్రం..అడ్మిషన్ల సమయంలోనే విద్యార్థులకు డ్రెస్‌కోడ్‌ని తెలియజేశామని, ఇప్పుడు దాని గురించి ఎందుకు ఆందోళనలు చేస్తున్నారో అర్థం కావడం లేదని అంటున్నారు.