క్రికెట్ బెట్టింగ్ ఓ మహిళ ఆత్మహత్యకు దారితీసింది. భర్త చేసిన తప్పుకు భార్య బలైంది. కర్ణాటకలో చిత్రదుర్గకు చెందిన దర్శన్ బాబు ఇంజనీర్.. ఈతనికి 2020లో రంజితతో వివాహమైంది. వీరికి రెండేళ్ల బాబు కూడా ఉన్నాడు. దర్శన్ హోసదుర్గలోని మైనర్ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేశాడు. అతనికి 2021 నుంచి క్రికెట్ బెట్టింగ్ అలవాటైంది. నెమ్మది నెమ్మదిగా బెట్టింగ్ వలలో చిక్కుకొని రూ.1.5 కోట్లకు పైగా అప్పు చేశాడు. చేసిన అప్పు తిరిగి చెల్లించలేక.. వడ్డీకి ఇచ్చిన వారి దగ్గర నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
ALSO READ | పార్టీలకు షాకిచ్చిన మెటా - ఇన్స్టాగ్రామ్ లో ప్రచారానికి చెక్..
దర్శన్ తీసుకున్నదాంట్లో రూ.కోటి వరకు తిరిగి ఇవ్వగలిగాడు. కానీ ఇంకా 13 మందికి రూ.84 లక్షల అప్పు దర్శన్ చెల్లించాల్సి ఉంది. అప్పులోల్ల వేధింపుల వల్ల 23 ఏళ్ల దర్శన్ భార్య మార్చి 18న సూసైడ్ చేసుకుంది. రంజిత సూసైడ్ లెటర్ రాసి మారీ చనిపోయింది. ఈ విషయంపై మృతురాలి తండ్రి వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని పోలీసులు చేసిన దర్యాప్తులో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్పు ఇచ్చిన వారే తన అల్లుడిని బెట్టింగ్ కు ప్రోత్సహించారని వెంకటేష్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.