కట్నం సరిపోలేదంటూ ఓ సారి.. అమ్మాయిని ప్రేమిస్తున్నానని మరోసారి స్టోరీ

కట్నం సరిపోలేదంటూ ఓ సారి.. అమ్మాయిని ప్రేమిస్తున్నానని మరోసారి స్టోరీ

కట్నం సరిపోలేదంటూ ఓ సారి.. మరో అమ్మాయిని ప్రేమిస్తున్నానని మరోసారి స్టోరీ

వరంగల్, వెలుగు : ఓ అమ్మాయితో ఎంగేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ చేసుకున్న పోలీస్‌‌‌‌ కానిస్టేబుల్‌‌‌‌ తర్వాత పెండ్లికి నిరాకరించాడు. కట్నం సరిపోలేదని ఓ సారి.. మరో అమ్మాయితో ప్రేమలో ఉన్నానని మరోసారి చెప్పి ముఖం చాటేశాడు. అమ్మాయి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కానిస్టేబుల్‌‌‌‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితులు, కేయూ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హసన్‌‌‌‌పర్తి మండలం వంగపహాడ్‌‌‌‌కు చెందిన కావటి వినయ్‌‌‌‌ ములుగు జిల్లాలో పోలీస్‌‌‌‌ కానిస్టేబుల్‌‌‌‌గా పనిచేస్తున్నాడు. హనుమకొండ యాదవ నగర్‌‌‌‌కు చెందిన లింగంపల్లి కుమారస్వామి కూతురు పూజితతో పెండ్లి కుదరడంతో ఈ నెల 17న ఎంగేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ కూడా అయింది. కట్నం కింద రూ.20 లక్షలు, బంగారం మాట్లాడుకొని, రూ. లక్ష తీసుకున్నాడు. అయితే తనకు కట్నం సరిపోలేదని, పెండ్లిని క్యాన్సిల్‌‌‌‌ చేసుకుంటానని వినయ్‌‌‌‌ ఈ నెల 23న అమ్మాయి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో షాక్‌‌‌‌కు గురైన వారు ఎంగేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ అయ్యాక పెండ్లి వద్దనడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత తాను మరో అమ్మాయిని ప్రేమిస్తున్నానని, ఆమెనే వివాహం చేసుకుంటానని చెప్పాడు. పూజిత తల్లిదండ్రులు కేయూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వినయ్‌‌‌‌పై చీటింగ్‌‌‌‌ కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవీందర్‌‌‌‌ తెలిపారు.