ఫోన్‌‌పే ఐపీఓకి రెడీ.. మార్చి నెల చివరిలోపు పబ్లిక్ ఇష్యూకి..

ఫోన్‌‌పే ఐపీఓకి రెడీ.. మార్చి నెల చివరిలోపు పబ్లిక్ ఇష్యూకి..

న్యూఢిల్లీ: వాల్‌‌మార్ట్‌‌కు వాటాలున్న ఫోన్‌‌పే ఐపీఓకి రావడానికి రెడీ అవుతోంది. ఇండియా ఎక్స్చేంజ్‌‌ల్లో లిస్టింగ్ కానుంది. రెండేళ్ల కిందట జరిగిన చివరి ఫండింగ్‌‌ రౌండ్‌‌లో ఫోన్‌‌పే 12 బిలియన్ డాలర్ల (రూ.1.04 లక్షల కోట్ల) వాల్యుయేషన్ పలికింది. మరోవైపు డిపాజిటరీ కంపెనీ నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్‌‌ఎస్‌‌డీఎల్‌‌)  ఐపీఓ ద్వారా రూ.3 వేల కోట్లు సేకరించాలని ప్లాన్‌‌ చేస్తోంది. వచ్చే నెల చివరిలోపు పబ్లిక్ ఇష్యూకి రావొచ్చు. మార్కెట్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్‌‌స్టిట్యూషన్ (ఎంఐఐ) అనుమతులు వచ్చే నెలలో ఎక్స్‌‌పైరీ అవుతాయి. ఈ డేట్‌‌కు ముందే ఐపీఓకి రావడానికి ప్రయత్నిస్తామని అధికారులు తెలిపారు.