Flipkart and Myntra: ప్లిప్కార్ట్, మింత్రా యూజర్లకు షాక్..ఇకపై ఆర్డర్ క్యాన్సలేషన్పై ఛార్జీలు!

ఇటీవల కాలంలో ఆన్ లైన్ షాపింగ్ బాగా పెరిగిపోయింది. అదో ట్రెండ్ అయిపోయింది. ఏదైనా కొనాలనుకుంటే చాలు.. సెల్ తీశామా .. ఈ కామర్స్ ఫ్లాట్ ఫాంలు ఓపెన్ చేశామా..ఆన్ లైన్ లో బుకింగ్ చేశామా.. ఇంకేముందు కావాల్సిన వస్తువు వెంటనే మన ముందుంటుంది..కాలు బయట పెట్టకుండానే షాపింగ్ అయిపోతుంది. అయితే మనం కొన్న వస్తువు నచ్చకపోయినా.. లేద వద్దనుకున్నా క్యాన్సల్ ఆర్డర్ కూడా పెట్టొచ్చు. అయితే ఈ విషయంలో కొన్ని ఈ కామర్స్ ఫ్లాట్ ఫాంలు కస్టమర్లకు షాకివ్వనున్నాయి. క్యాన్సల్ ఆర్డర్ పై ఈ కామర్స్ ప్లాట్ ఫాంలు ఛార్జీలు వసూలు చేసేందుకు రెడీ అవుతున్నాయని ప్రచారం సాగుతోంది. 

నిన్న మొన్నటి వరకు ఎటువంటి ఫ్లాట్ ఫాం ఫీజులు లేకుండా, ఎటువంటి ఆర్డర్ క్యాన్సలేషన్ ఛార్జీలు లేకుండా ఈ కామర్స్ సంస్థలు సర్వీస్ చేశారు.. ఇటీవల ఫ్లాట్ ఫాం ఛార్జీలు విధించాయి. త్వరలో ఆర్డర్ క్యాన్సలేషన్ ఫీజు కూడా వసూలు చేస్తాయట. 

Also Read :- రికార్డు స్థాయిలో పడిపోయిన రూపాయి

ఫ్లిప్ కార్ట్, మింత్రా(Myntra) ఆన్ లైన్ ఈ కామర్స్ ఫ్లాట్ఫాంలు ఆర్డర్ క్యాన్సలేషన్ ఛార్జీలు వసూలుకు సిద్దమవుతున్నాయి. ఈ ప్లాట్ ఫంలలో ఏదైన వస్తువులు కొనుగోలు చేసి ఆర్డర్ క్యాన్సల్ చేస్తే ఛార్జీలు చెల్లించాల్సిందే.త్వరలో ఈ ఛార్జీలు అమలు చేయనున్నారు. వస్తువుల ధరలను బట్టి ఈ ఛార్జీలు ఉంటాయి. 

ఈకామర్స్ ఫ్లాట్ ఫాం లనుంచి వచ్చిన మేసేజ్ ప్రకారం..త్వరలో ఆర్డర్ల రద్దుపై ఛార్జీల మోత మోగనుంది. విక్రేతలు, డెలివరీ పార్టినర్స్ ఖర్చులు, సమయం వృధా కాకుండా ఈ ఈ నిర్ణయం తీసుకున్నాయని టాక్.. ఈ విషయంపై ఫ్లిప్ కార్ట్, మింత్రా సంస్థలు స్పందించాయి. ప్రస్తుతం అయితే ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడంలేదు.. ఆన్ లైన్ జరుగుతున్న ప్రచారం అంతా వట్టిదేని తేల్చింది. అయితే ప్లిఫ్ కార్ట్ మాత్రం ఈ విషయంపై ఇంకా ఎలాంటి స్పందన లేదు.