న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇన్ ఫ్రాను క్రియేట్ చేయడానికి బదులు అర్వింద్ కేజ్రీవాల్ తన కోసం శీష్ మహల్ కట్టుకున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. దీనికి ఆయన జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ‘‘కేజ్రీవాల్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రభుత్వ కారు, బంగ్లా తీసుకోనని ప్రతిజ్ఞ చేశారు. కొత్త రకమైన రాజకీయాలకు నాంది పలుకుతానని అన్నారు. కానీ, ఆయన 3, 4 బంగ్లాలతో సంతృప్తి చెందలేకపోయారు. తన కోసం 50 వేల చదరపు గజాల విస్తీర్ణంలో శీష్ మహల్‌ను నిర్మించుకున్నారు. ఢిల్లీ ప్రజలపై రూ.45 కోట్ల భారాన్ని మోపారు” అని అమిత్ షా పేర్కొన్నారు.