కోల్కతా యువకుడిని పెళ్లి చేసుకునేందుకు ఇండియా వచ్చిన పాకిస్థాని యువతి

కోల్కతా యువకుడిని పెళ్లి చేసుకునేందుకు ఇండియా వచ్చిన పాకిస్థాని యువతి

భారత్ కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు పాకిస్థాని మహిళ సరిహద్దులు దాటి రావడం చర్చనీయాంశమైంది. పాకిస్థాన్ లోని కరాచీకి చెందిన జవారియ ఖానం అనే మహిళ.. అమృతత్ సరి్ అట్టారీ-వాఘా సరిహద్దును దాటి ఇండిలో ప్రవేశించింది. అక్కడ ఆమెకు కాబోయే భర్త, సమీర్ ఖాన్, అతని కుటుంబ సభ్యులు వాఘా సరిహద్దు వద్ద ఘనంగా స్వాగతం పలికారు.పశ్చిమ బెంగాల్ లోని గురుదాస్ పూర్ కు చెందిన సమీర్ ఖాన్ కుటుంబం నివసిస్తోంది. సరిహద్దు దాటిన తర్వాత రెండుకుటుంబాలు విమానంలో కోల్ కతాకు వెళ్లి అక్కడి ముస్లిం ఆచారాలను ప్రకారం ఈ జంట పెళ్లి చేసుకోనున్నారు. 45 రోజుల వీసాపై భారత్ లో ఉండనున్నారు. 

వాస్తవానికి జవారియా ఖానం, ఆమె కుటుంబానికి ఇండియాకు రావడానికి భారత ప్రభుత్వం వీసా నిరాకరించింది. అయితే పంజాబ్ కు చెందిన ఓ సామాజిక కార్యకర్త సాయంతో ఆమెకు కుటుంబం 45 రోజుల వీసా పొందింది. పెళ్లి తర్వాత వీసా గడువును పొడగించేందుకు జవారియా కుటుంబ సభ్యులు దరఖాస్తు చేయనున్నారు. 

దాయాది దేశం పాకిస్థాన్ తో సరిహద్దు వివాహాలు కొత్తేమి కాదు. ఇటీవల పాకిస్థాన్ కు చెందిన సీమా హైదర్ నలుగురు పిల్లలను వదిలిపెట్టి నేపాల్ మీదుగా భారత్ సరిహద్దు దాటి దేశంలోకి ప్రవేశించిన విషయం అందరికి తెలిసిందే. ఆమె నోయిడా కు చెందిన సచిన్ మీనా అనే వ్యక్తిని వివాహం చేసుకంది. సీమా హైదర్- సచిన్ మీనా వివాహం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ జంట సోషల్ మీడియాలో సెలబ్రిటీలు అయ్యారు. అయితే సీమా హైదర్ సరిహద్దు దాటి ఇండియాలో ప్రవేశించడం వెనక ఏమైనా కుట్ర ఉందా అన్న కోణంలో కూడి దర్యాప్తు సంస్థలు విచారణకూడా చేశారు. 
  
సీమా హైదర్ ఘటన తర్వాత అంజు అనే ఇండియాకు చెందిన మహిళ తన ఫేస్ బుక్ స్నేహితుడిని పెళ్లి చేసుకునేందుకు 2023 జూన్ లో పాకిస్థాన్ కు వెళ్లింది. ఆమె ఇటీవలే  వాఘా సరిహద్దు మీదుగా ఇండియాకు తిరిగి వచ్చింది. దర్యాప్తు ఏజెన్సీల విచారణ తర్వాత ఆమెను అమృత్ సర్ లోని విమానాశ్రయానికి పంపించారు. 

ఇష్టపడిన వారిని పెళ్లి చేసుకునేందుకు సరిహద్దులు దాటిన ఘటనలు ఈ ఏడాదిలో మూడు జరిగాయి. సరిహద్దులు దాటుతుండటంతో వారు దర్యాప్తు ఏజేన్సీ విచారణను కూడా ఎదుర్కొన్నారు ఎట్టకేలకు వివాహం చేసుకున్నారు.