ఇదీ నిజం : సెప్టెంబర్ 30 తర్వాత LIC పాలసీలు యథావిథిగానే ఉంటాయి.. రద్దు కావు.. !

ఇదీ నిజం : సెప్టెంబర్ 30 తర్వాత LIC పాలసీలు యథావిథిగానే ఉంటాయి.. రద్దు కావు.. !

LIC పాలసీలు తీసుకున్నవారు.. ఇప్పుడు కొత్తగా తీసుకోవాలనుకుంటున్న వారు.. మంచి ప్లాన్ ఉండి తీసుకోలేకపోయిన వారిలో కొద్ది రోజులుగా గందరగోళం నెలకొంది.  లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) సెప్టెంబర్ 30 తర్వత ఇప్పుడున్న పాలసీలు అన్ని రద్దు అవుతున్నాయి. కొత్త పాలసీ స్కీంలు వస్తాయి.. అంతేకాదు.. ఇప్పుడున్న దానికంటే ప్రీమియం ఛార్జీలు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు అని వార్తలు వస్తున్నాయి. దీంతో ఎల్ఐసీలో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న వారు.. ఇప్పుడు ఫ్రెష్ గా తీసుకోవాలనుకుంటున్న వారు అయోయమంలో పడిపోయారు. 

జీవన్ ఆనంద్, జీవన్ ఉమంగ్ మరియు జీవన్ ఉత్సవ్ వంటి ప్లాన్‌లను కూడా LIC రద్దు చేయాలని ఆలోచిస్తోందని నోటీసులు కూడా ఇంటర్ నెట్ లో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆల్ రెడీ ప్లాన్ తీసుకొని ప్రీమియం చెల్లిస్తున్న వారు వినియోగదారులు ఆందోళనలో పడిపోయారు. డిసెంబర్ 30 తర్వాత LIC కొత్త పాలసీ స్కీలు రివిజన్ చేస్తోందని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. 

ALSO READ | నెలకు 1 శాతం వడ్డీకి ​ బంగారం లోన్లు

ఇప్పుడున్న ఎల్ఐసీ పాలసీలు సెప్టెంబర్ 30 వరకే గడువు అని వచ్చే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. అది పూర్తిగా ఫేక్ న్యూస్ అని ఫ్యాక్ట్ చెక్ లో పెట్టారు. నిజానికి ఎల్ఐసీ పాలసీలు తొలగిస్తున్నట్లు, రివిజన్ చేస్తున్నట్లు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. సోషల్ మీడియాలో వస్తున్నవి కేవలం వదంతులు మాత్రమే. LIC ఈ న్యూస్ ను ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేసింది. 

కొందరు ఏజెంట్లు వినియోగదారులను భయపెట్టి.. మంచి ఇన్యూరెన్స్ ప్లాన్స్ అన్ని సెప్టెంబర్ 30 వరకే ఉంటాయని ప్రజల్ని మోసం చేస్తున్నారు. తర్వాత వాటిని రద్దు చేసి వాటి ప్లేస్ లో కొత్త పాలసీలు తీసుకొస్తున్నారని జనాలకు చెప్పి కొత్త పాలసీలు కట్టించుకుంటున్నారు. దీనిపై ఎల్ఐసీ స్పందించి పాలసీల రద్దు గురించి వస్తున్న వార్తలు నిజం కాదని తేల్చి చెప్పింది.