తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు నిర్మిస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థగా గుర్తింపును అందుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. ఇప్పుడు ఇతర భాషల్లోకి అడుగుపెడుతోంది. తమ 49వ చిత్రాన్ని కన్నడ స్టార్ గణేష్‌తో తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. కొరియోగ్రాఫర్ బి ధనంజయ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.
లార్జర్ దేన్ లైఫ్ స్టోరీగా దీన్ని రూపొందిస్తున్నట్టు తెలియజేశారు. టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ కన్నడ సినిమా అపారమైన సామర్థ్యాన్ని ఒక బిగ్ స్టేజ్‌పై ప్రెజెంట్ చేయాలనే వారి లక్ష్యాన్ని తెలియజేస్తోంది. ఈ సినిమా టైటిల్, నటీనటులు, ఇతర సాంకేతిక వివరాలు త్వరలోనే తెలియజేస్తామన్నారు.