SRH vs GT: సన్రైజ్‌‌‌‌ అయ్యేనా..ఇవాళ(ఏప్రిల్6) ఉప్పల్‌‌‌‌లో జీటీతో ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌హెచ్ మ్యాచ్‌‌‌‌

SRH vs GT: సన్రైజ్‌‌‌‌ అయ్యేనా..ఇవాళ(ఏప్రిల్6) ఉప్పల్‌‌‌‌లో జీటీతో ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌హెచ్ మ్యాచ్‌‌‌‌
  • రా. 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌‌‌‌, జియో హాట్‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌లో లైవ్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: వరుసగా మూడు పరాజయాలతో డీలా పడ్డ సన్ రైజర్స్‌‌‌‌ హైదరాబాద్ సొంతగడ్డపై తిరిగి గెలుపు బాట పట్టాలని చూస్తోంది. ఉప్పల్ స్టేడియంలో ఆదివారం జరిగే తమ నాలుగో పోరులో గుజరాత్‌‌‌‌ టైటాన్స్‌‌‌‌ను ఎదుర్కోనున్న ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌హెచ్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మొదటి మ్యాచ్‌‌‌‌లో 286  స్కోరు కొట్టిన రైజర్స్ తర్వాత 190, 163 స్కోర్లతో నిరాశపరచగా.. కేకేఆర్‌‌‌‌‌‌‌‌తో గత పోరులో భారీ టార్గెట్ ఛేజింగ్‌‌‌‌లో 120 రన్స్‌‌‌‌కే కుప్పకూలి చిత్తుగా ఓడింది. 

భారీ అంచనాలు పెట్టుకున్న టాపార్డర్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్ల ఫెయిల్యూర్‌‌‌‌‌‌‌‌ జట్టును దెబ్బతీస్తోంది. దూకుడు, అతి దూకుడుకు మధ్య సరైన బ్యాలెన్స్‌‌‌‌ లేక బ్యాటింగ్ యూనిట్ ఫెయిలవుతోంది. అదే సమయంలో బౌలర్లూ నిరాశపరుస్తున్నారు. స్పిన్నర్ జీషన్ అన్సారీ తప్పితే మిగతా బౌలర్లు ఎక్కువ రన్స్ ఇచ్చుకుంటున్నారు. మరోసారి ఓడితే రైజర్స్ మరింత ఆత్మరక్షణలో పడిపోతుంది. కాబట్టి ఓపెనర్లు అభిషేక్‌‌‌‌, హెడ్‌‌‌‌తో పాటు హిట్టర్లు ఇషాన్‌‌‌‌, క్లాసెన్‌‌‌‌ తమ మార్కు చూపెట్టాల్సిన అవసరం  ఉంది.

 కమిన్స్ నేతృత్వంలోని బౌలర్లు కూడా గాడిలో పడాల్సిందే. ఫీల్డింగ్‌‌‌‌లోనూ కమిన్స్‌‌‌‌సేన తక్షణమే మెరుగవ్వాలి. మరోవైపు వరుసగా రెండు విజయాలతో జోరు మీదున్న శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్ కెప్టెన్సీలోని జీటీ హ్యాట్రిక్ విక్టరీపై కన్నేసింది. బ్యాటింగ్‌‌‌‌లో సుదర్శన్‌‌‌‌, జోస్ బట్లర్ జోరు మీద ఉండగా.. బౌలింగ్‌‌‌‌లో హైదరాబాదీ సిరాజ్‌‌‌‌, అర్షద్‌‌‌‌, సాయి కిశోర్ సత్తా చాటుతున్నారు.