డెలివరీ ఏజెంట్స్ జాగ్రత్త : ఐఫోన్ కోసం క్యాష్ ఆన్ డెలివరీ పెట్టి చంపేశాడు

డెలివరీ ఏజెంట్స్ జాగ్రత్త : ఐఫోన్ కోసం క్యాష్ ఆన్ డెలివరీ పెట్టి చంపేశాడు

ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో ఆపిల్ ఫోన్స్ కు భారీ ఆఫర్ సేల్ నడుస్తోంది. ఎలాగైనా లక్షా 50వేల విలువ గల ఐ ఫోన్ నా చేతికి వస్తే చాలు అనుకున్నాడట్టుంది ఓ యువకుడు. దాని కోసం డెలివరీ ఏజెంట్ ను చంపి మూటకట్టి, నదిలో పడేశాడు.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తనకు నచ్చిన 1.5 లక్షల ఖరీదైన ఆపిల్ ఫోన్ ఆన్ లైన్ ఫ్లిప్ కార్ట్ లో ఆర్డర్ పెట్టాడు. దాన్ని డబ్బులు కట్టకుండా సొంతం చేసుకోవాలని ప్లాన్ వేశాడు. ఆర్డర్ పెట్టిన ఫోన్ ను తీసుకొని డెలివరీ ఏజెంట్ రానే వచ్చాడు. తర్వాత జరిగింది తెలిస్తే.. డెలివరీ బాయ్స్ గుండెల్లో ఒణుకు పుట్టుద్ది. 

ఐఫోన్ కోసం డెలివరీ బాయ్ ని కిరాతకంగా చంపిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని చిన్‌హట్ ప్రాంతంలో చోటుచేసుకుంది. 30ఏళ్ల భరత్ సాహు డెలివరీ ఏజెంట్ గా పని చేస్తున్నాడు. సెప్టెంబర్ 23 న చిన్ హట్ ప్రాంతంలోని గజానన్ కు ఓ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్లాడు. అప్పటి నుంచి అతను కనబడటలేదు. గజానన్ అనే యువకుడు ఫ్లిప్ కార్ట్ ఆఫర్ సేల్ లో ఐఫోన్ ఆర్డర్ చేశాడు. పేమెంట్ క్యాష్ అన్ డెలివరీ  ఆప్షన్ పెట్టాడు. ఫోన్ డెలివరీ చేయడానికి ఇంటికి వచ్చిన డెలివరీ ఏజెంట్ ను గజానన్ ఫ్రెండ్ తో  కలిసి గొంతు కోసి చంపాడు. తర్వాత ఇద్దరు కలిసి ఓ గోనె సంచిలో వేసి మూటకట్టి డెలివరీ బాయ్ మృతదేహాన్ని ఇందిరా కెనాల్‌లో పడేశారు. 

డెలివరీ డ్యూటీకి వెళ్లిన భరత్ సాహు రెండు రోజులుగా ఇంటికి రాకపోవడం.. ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు.  పోలీసుల విచారణలో భరత్ సాహు లాస్ట్ డెలివరీ గజానన్ కు  చేశాడని తెలిసింది. గజానన్ కోసం ఎంత వెతికినా పోలీసులకు ఆచూకీ లభించలేదు. దీంతో గజానన్ ఫోన్ నెంబర్ పట్టుకున్నారు. దాంతో అతని ఫ్రెండ్ ఆకాష్‌ను పట్టుకున్నారు. అతన్ని విచారించగా.. ఆసలు విషయం బయట పెట్టేశాడు. ఫోన్ తీసుకొని భరత్ సాహును చంపేసినట్లు ఓప్పుకున్నారు. నిందితులు చెప్పిన వివరాల ప్రకారం.. పోలీసులు, రెస్య్యూ టీం ఇందిరా నది దగ్గరకు వెళ్లి నదిలో డెడ్‌బాడీని వెతుకుతున్నారు.

ఇలాంటి కేసులో ఇండియాలో రెండు జరిగాయి. 2021లో బెంగుళూర్, 2022లో నోయిడాలో డెలివరీ ఏజెంట్లను చంపిన కేసులు ఉన్నాయి.