నిన్న టెకీ అతుల్ సుభాష్..ఇవాళ హెడ్ కానిస్టేబుల్..పెళ్లాం వేధింపులతో 33 ఏళ్ల పోలీస్ ఆత్మహత్య

నిన్న టెకీ అతుల్ సుభాష్..ఇవాళ హెడ్ కానిస్టేబుల్..పెళ్లాం వేధింపులతో 33 ఏళ్ల పోలీస్ ఆత్మహత్య

సేమ్ టు సేమ్..అదే వేధింపులు..అవే కేసులు..అదే టార్చర్..నిత్యం నరకం.. డ్యూటీ చేసుకునే పరిస్థితి లేదు.. మనశ్వాంతిగా నిద్రపోయిన రోజులు లేవు.. రోజుల తరబడి అదే ఆందోళన.. చివరి ప్రాణాలు తీశాయి. నిన్న యూపీ అతుల్ సుభాష్ కు ..ఇవాళ బెంగళూర్ లో హెడ్ కానిస్టేబుల్.

భార్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపులకు బెంగళూరు టెకీ సూసైడ్ ఘటన మరవకముందే అదే  ప్రాంతంలో మరో దారుణ ఘటన.. భార్య, ఆమె కుటుంబ సభ్యుల వేధింపులకు మానసికంగా కుంగిపోయిన బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు బెంగళూరు కు చెందిన హెడ్ కానిస్టేబుల్ తిప్పన్న అలుగూరు. వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. ఛిద్రమైన తిప్పన్న శరీర భాగాలతో పాటు అక్కడో సూసైడ్ లెటర్ స్వాధీనం చేసుకోవడం.. తిప్పన్న అలుగురు భార్య టార్చర్ విషయాలు బయటికొచ్చాయి. 

శుక్రవారం ( డిసెంబర్ 13) రాత్రి బైయప్పనహళ్లి రైల్వే స్టేషన్ సమీపంలో వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు తిప్పన్న అలుగూరు.. శనివారం ఉదయం ట్రాక్ పై ఛిద్రమైన ఉణ్న తిప్పన్న అలుగురు శరీరభాగాలతో పాటు డెత్ నోట్ కూడా స్వాధీనం చేసుకున్నారు రైల్వే పోలీసులు. 

తిప్పన్న అలుగూరు తన డెత్ నోట్ లో తాను టార్చర్, బాధను వివరించాడు. గత కొంతకాలంగా తన భార్య, ఆమె తండ్రి,తల్లి వేధిస్తున్నారని ఆరోపించాడు.  భార్యభర్తల మధ్య మనస్పర్థలతో గొడవలు జరుగుతుండగా.. శుక్రవారం రాత్రి మరింత ముదిరాయి. భార్యతో గొడవపడ్డ విషయాన్ని భార్య తండ్రికి చెప్పగా.. అతను కూడా దుర్భాషలాడినట్లు తిప్పన అలుగురిరు సూసైడ్ నోట్ లో రాసుకున్నాడు. 

‘‘నువ్వు చనిపో.. నువ్వు లేకుండా నా కూతురు బాగుపడుతుంది.. సంతోషంగా బతుకుతుంది అని’’ తిప్పన మామ ఫోన్లో దుర్భాషలాడడంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు డెత్ లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

తిప్పన అలుగురు కర్ణాటకలోని విజయపుర జిల్లా సింధగి సమీపంలోని హండిగనూరుకు చెందినవాడు. హులిమావు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి బెంగళూరులోని హీలాలిగే రైల్వే స్టేషన్, కార్మిలారం హుసగూరు రైల్వే గేట్ మధ్య వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. డ్యూటీలో ఉండగానే ఆత్మహత్య కు పాల్పడ్డాడు. తిప్పన మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సీవీ రామన్ ఆస్పత్రికి తరలించారు. 

తిప్పన ఆత్మహత్య చేసుకోవడంతో అతని పేరెంట్స్ ఆందోళనకు దిగారు. తన కుమారుడి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తిప్పన్న పేరెంట్స్ కంప్లయింట్ మేరకు నిందితులు అయిన అతని భార్యపై 108, 351(3), 352 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.