2026 జనాభా లెక్కల తర్వాత ఎస్సీలు ఎంత పెరిగితే అంత శాతం రిజర్వేషన్లు: మంత్రులు ఉత్తమ్, దామోదర

2026 జనాభా లెక్కల తర్వాత ఎస్సీలు ఎంత పెరిగితే అంత శాతం రిజర్వేషన్లు: మంత్రులు ఉత్తమ్, దామోదర

అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసినట్లు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ అన్నారు. ఇవాళ్టి (ఏప్రిల్ 14) నుంచి ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని ఈ సందర్భంగా చెప్పారు. ఎస్సీ వర్గీకరణ జీవోను విడుదల చేసిన మంత్రివర్గం.. తొలికాపీని సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. 

ఎస్సీ వర్గీకరణ కోసం తొలి నుంచి ప్రయత్నం వేగవంతం చేశామని ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ అన్నారు. వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టిస్తుందని చెప్పారు. 15 శాతం రిజర్వేషన్లలో అందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు. విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు అమలు చేస్తామని.. ఇవాళ్టి నుంచి భారీ స్థాయిలో నోటిఫికేషన్లు ఇవ్వనున్నామని చెప్పారు. వర్గీకరణ గురించి గతంలో ఎవరూ పట్టించుకోలేద.. తమ ప్రభుత్వం వచ్చాకే వర్గీకరణ పూర్తైందని అన్నారు. సోషల్ జస్టిస్ కు కాంగ్రెస్ కట్టుబడి ఉన్నదనే దానికి నిదర్శనం అని అన్నారు. 

ఎస్సీ వర్గీకరణ అంశంలో కేబినెట్ కమిటీవేసి ముందుకు వెళ్లినట్లు మంత్రి దామోదర తెలిపారు. ఏకసభ్య కమిషన్ నియమించి నిస్పాక్షింగా రిపోర్టు ఇచ్చినట్లు చెప్పారు. 90 రోజుల్లో షమీమ్ అక్తర్ కమిటీ రిపోర్టు ఇచ్చిందని అన్నారు. వర్గీకరణ అంశంలో కొన్ని వేల విజ్ఞప్తులు వచ్చాయని.. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు ఈ సందర్భంగా మంత్రి దామోదర తెలిపారు.