ఓ డాక్టర్ నెగ్లిజన్స్ పేషెంట్ ప్రాణాల మీదకు వచ్చింది. ఆపరేషన్ తర్వాత పేషెంట్ కడుపులో దూదిని వదిలేశాడు డాక్టర్. డిశ్చార్జ్అయిన పెషంట్ ఆరోగ్యం ఇంకా కుదుట పడట్లేదు. దీంతో మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు అల్ట్రాసౌండ్ స్కానింగ్చేశారు. దీంతో పేషెంట్ కడుపులో దూది ఉన్న విషయం బయటపడింది. ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కుటుంబసభ్యులు అగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌కు లోహియానగర్‌క చెందిన సల్మాన్ అనే వ్యక్తి పిత్తాశయంలో అనారోగ్యం కారణంగా అదే ప్రాంతంలోని హాపుర్ రోడ్‌లోని ఓ నర్సింగ్‌హోమ్‌లో చేరాడు. గత నెలలోనే ఓ వైద్యుడు గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేశాడు. డాక్టర్ ఆపరేషన్ చేస్తున్న సమయంలో కడుపులోనే దూదిని వదిలేశాడు.
సర్జరీ తర్వాత పేషెంట్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లిపోయాడు. ఆరోగ్యం కుదుటపడకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయగా.. అతడి కడుపులో దూది ఉండటం చూసి షాకయ్యారు. దీంతో అక్కడి వైద్యులు ఆపరేషన్ చేసి కాటన్ స్ట్రిప్‌ను తొలగించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన సోదరుడు ప్రాణాపాయస్థితికి చేరుకున్నాడని, సదరు ఆస్పత్రిపై వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితుడి సోదరుడు బిలాల్పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు లోహియా నగర్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జి సంజయ్ సింగ్ తెలిపారు. విచారణ తర్వాత నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.