'ఇడ్లీ కొట్టు'తో ఫేమస్ కాబోతున్న ధనుష్, నిత్యా మీనన్.. వైరల్ అవుతున్న పోస్ట్

త‌మిళ స్టార్ న‌టుడు ధ‌నుష్‌(Dhanush), స్టార్ హీరోయిన్ నిత్యా మీనన్ (Nithya Menen) వీరిద్దరి పేర్లను తెలుగు ప్రేక్షకులకు ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు. రఘువరన్ బీటెక్, న‌వ మ‌న్మధుడు, సార్ వంటి చిత్రాల‌తో టాలీవుడ్‌లోనూ మంచి మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నాడు ధనుష్. ఇటీవ‌లే రాయన్ తన 50వ సినిమాతో మంచి స‌క్సెస్‌ను అందుకున్నాడు ధనుష్. పాన్ ఇండియా చిత్రాల‌ను చేస్తూ బిజీగా ఉన్నాడు.

అలాగే నిత్యా తెలుగులో అలా మొదలైంది, ఉరుమి, వయోలిన్, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, బెంగళూరు డేస్, S/O సత్యమూర్తి, గీత గోవిందం ఇలా తెలుగుతో పాటు పాన్ ఇండియా భాషల్లో సినిమాలు చేస్తూ నేషనల్ అవార్డు కూడా సాధించింది. అంతేకాదు ధనుష్ ఇప్పటికే నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ అందుకున్నాడు. 

Also Read : ఇదే నా చివరి సీజన్.. హోస్ట్గా బిగ్బాస్ చేయనంటూ స్టార్ హీరో ట్వీట్

ఇదిలా ఉంటే.. ధనుష్  52వ సినిమాలో హీరోయిన్ నిత్యా మీనన్ నటిస్తోంది. ఈ క్రమంలో తాజాగా నిత్యా త‌న ఇంస్టాగ్రామ్లో షేర్ చేసిన ఫోటో సినిమా నేపథ్యాన్ని తెలుపుతోంది. 'నిత్యా మీనన్, ధనుష్ టీ గ్లాసులను చేతిలో పట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు. ‘కొత్త జర్నీ స్టార్ట్ అయ్యింది ఇడ్లీ కడై’ అని ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది.  దాంతో గ్రామీణ నేపథ్యంలో ఇడ్లీ కొట్టు పెట్టుకుని బ్రతికే జంటగా వీరు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ మూవీకి 'ఇడ్లీ కొట్టు' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. కాగా ఈ జంట 2022లో వచ్చిన ‘తిరు' మూవీలో నటించారు. ఈ మూవీకిగాను నిత్యా మీనన్కి నేషనల్ అవార్డు వరించింది. అలాగే ఈ మూవీలో 'మేఘం కరిగేనా..పిల్లో పిల్లో' సాంగ్ ఆడియన్స్కి ఎంతో సుపరిచితం. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nithya Menen (@nithyamenen)

అయితే, ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..ఈ మూవీకి ధనుష్ దర్శకత్వం వహించడం విశేషం. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను డాన్ పిక్చర్స్ బ్యానర్ పై  ఆకాష్ బాస్కరన్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్ 51వ మూవీ 'కుబేర' లో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకి పనిచేయబోయే టెక్నీషియన్స్ వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.