
సౌత్ మరియు నార్త్ లో చక్రం తిప్పుతున్న హీరోయిన్ తమన్నా (Tamannaah) అంటే అందరికీ స్పెషలే. తనకి సంబంధించిన ఎటువంటి వార్తా అయిన క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. ఈ క్రమంలో లేటెస్ట్ గా తమన్నా మాతా కీ చౌకీ పూజలు నిర్హహించారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇపుడీ ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
నవరాత్రి పండుగ సందర్భంగా తమన్నా భాటియా తన ఇంట్లో మాతా కీ చౌకీని నిర్వహించింది. ఈ కార్యక్రమంలోని ఒక వీడియోలో దుర్గాదేవికి ప్రార్థనలు చేస్తూ హారతి పడుతూ భజనలు (భక్తి పాటలు) ఆస్వాదిస్తూ ఉంది. మరొక వీడియోలో రవీనా టాండన్ కుమార్తె, రాషా థడానీతో కలిసి డ్యాన్స్ చేసింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలను సింగర్ ప్రీతి టాండన్ పఠానియా సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
ALSO READ | Jana Nayagan OTT: కళ్లు చెదిరే మొత్తానికి జన నాయగన్ ఓటీటీ హక్కులు.. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే!
ఇటీవల, విజయ్ వర్మతో విడిపోయారనే వార్తలు ఊపందుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ వేడుకల్లో తమన్నా విజయ్ వర్మ ఎక్కడ కనిపించకపోవడంతో మరోసారి రూమర్స్ మొదలయ్యాయి. ఇటువంటి ఆరోపణల మధ్య విజయ్ వర్మతో బ్రేకప్ పై తమన్నా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
ప్రస్తుతం తమన్నా తెలుగు సినిమాల విషయానికి వస్తే.. ఆమె త్వరలో 'ఓదెలా 2' తో రానుంది. ఈ సినిమా ఏప్రిల్ 17న థియేటర్లలలో రిలీజ్ కానుంది. ప్రత్యేకత ఏమిటంటే ఈ మూవీ టీజర్‌ను ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభ ఉత్సవంలో విడుదల చేశారు. ఇది 'ఓదెలా రైల్వే స్టేషన్' కి సీక్వెల్.